Home

»

Bollywood News

ఓర్రీ పెళ్లి: వైరల్‌గా మారిన వెడ్డింగ్ ఇన్విటేషన్.. పెళ్లికూతురు ఎవరు.?

Sep 26, 2026 12:13PM

బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి కనిపిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఓర్రీ.. ఇప్పుడు ఏకంగా తన పెళ్లి వార్తలతో హాట్ టాపిక్‌గా మారాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ఓర్రీ అసలు పేరు ఓర్హాన్ అవత్రామణి. సెలబ్రిటీ పార్టీల్లో, ఈవెంట్లలో తరచూ కనిపించే ఆయనకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న పోస్టులు మాత్రం ఆయన పెళ్లి గురించే కావడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల ఓర్రీ పెళ్లి ఇన్విటేషన్‌గా చెబుతున్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఓర్రీ కూడా ఇన్విటేషన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టడంతో ఈ ప్రచారానికి మరింత ఊపొచ్చింది.

వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక ప్రకారం.. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ‘Wedding Weekend’ పేరుతో వరుసగా వేడుకలు జరగనున్నట్లు ఉంది. సెప్టెంబర్ 26న రాత్రి 8 గంటల నుంచి ‘మెహ్‌ఫిల్-ఎ-సూఫియానా’ పేరుతో మ్యూజిక్, లైవ్ పెర్ఫార్మెన్స్‌లతో కార్యక్రమం ఉండనుందట. ఇక సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘రంగ్-ఎ-ఇష్క్’, రాత్రి 8 గంటల నుంచి ‘షాదీ ముబారక్’ జరగనున్నట్లు ఇన్విటేషన్‌లో ఉంది.

ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ రైట్స్ 90 కోట్లా.. నాగవంశీ రిస్క్ వెనుక ఉన్న అసలు నిజమిదే.!

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ వేడుకలు ఓర్రీ పెళ్లికి సంబంధించినవేనా అన్నది మాత్రం ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. ఇది ఏదైనా బ్రాండ్ క్యాంపెయిన్, యాడ్ లేదా మరో ప్రాజెక్ట్‌లో భాగమై ఉండొచ్చనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

ఓర్రీ గతంలో కూడా తన సోషల్ మీడియా పోస్టులు, సెలబ్రిటీలతో సరదా సంభాషణల కారణంగా పెళ్లి వార్తల్లో నిలిచాడు. 2025లో ఊర్వశి రౌతేలా చేసిన ఓ సరదా కామెంట్‌కు ఓర్రీ ఇచ్చిన రిప్లై కూడా అప్పట్లో పెళ్లి వార్తలకు దారితీసింది. అయితే అది కేవలం సరదా సంభాషణగానే నిలిచిపోయింది.

ఇప్పుడు మాత్రం ‘Wedding Weekend’, ‘Shaadi Mubarak’ అంటూ ఏకంగా ఇన్విటేషన్ బయటకు రావడంతో ఈసారి విషయం ఏంటనేది మరింత ఆసక్తిగా మారింది.

మరి ఓర్రీ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? లేక అందరినీ మరోసారి సర్‌ప్రైజ్ చేయడానికి ఇదంతా ఓ ప్లాన్‌నా? సెప్టెంబర్ 27న అసలు విషయం బయటపడే వరకు సస్పెన్స్ కొనసాగాల్సిందే.

 

 

 

[Orry Wedding, Orry Marriage, Orry Wedding Invitation, Orry Real Name, Orry Biography, Bollywood News, Telugu Film News, Telugu News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com