రేప్ కేసులో హీరోకి ఏడేళ్లు జైలు శిక్ష.. ఆ సినిమాకి అదే ఇన్‌స్పిరేషన్!
on Sep 11, 2025
సినిమాలకు సంబంధించి కొన్ని కథలను కొత్తగా క్రియేట్ చేస్తారు, మరికొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తయారు చేస్తారు. అలా చేసిన కథలు ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తాయి. ఎందుకంటే ఆ ఘటన ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అలాంటి ఓ ఘటన 2009లో జరిగింది. అయితే జరిగిన ఘటనను సినిమాగా తియ్యలేదు. అది చట్టంలో ఏ సెక్షన్‌కి చెందుతుంది. అందులో ఉన్న లొసుగులు, లోటుపాట్లు ఏమిటి అనేది సినిమాలో చర్చించారు. అదే ‘సెక్షన్ 375’. ఈ సినిమాకి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ఆ కేసులో నిందితుడు బాలీవుడ్‌లో ఒకప్పుడు లవర్‌బోయ్‌గా వెలిగిపోయాడు. దాదాపు పదేళ్ళపాటు అతని కెరీర్ కొనసాగింది. గత పదేళ్లుగా అతను ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. అలా అనడం కంటే ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు అనడం కరెక్ట్. అతని పేరు షైనీ అహుజా. గ్యాంగ్‌స్టర్, ఫనా, భూల్ భులయ్యా, జిందగీ రాక్స్, ఖోయా ఖోయా చాంద్ వంటి చాలా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి రాకముందే 1997లో అనుపమ్ పాండేను పెళ్లి చేసుకున్నాడు.
కట్ చేస్తే.. 2009లో తన ఇంట్లో పనిచేసే 19 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశాడు అనే ఆరోపణపై షైనీ అహూజను అరెస్ట్ చేశారు. పోలీసులు అనేక కోణాల్లో విచారించి కోర్టుకు నివేదికను సమర్పించారు. అప్పటివరకు రేప్ చేశాడని చెప్తూ వచ్చిన ఆ అమ్మాయి.. అత్యాచారం జరగలేదని తన వాంగ్మూలాన్ని మార్చుకుంది. అయితే కోర్టు మాత్రం ఆమె చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోలేదు. భయం వల్లనో, టెన్షన్ వల్లనో తన వాంగ్మూలాన్ని మార్చి చెప్పిందని కోర్టు భావించింది. షైనీని దోషిగా నిర్థారించి అతనికి ఏడేళ్ళు జైలు శిక్ష విధించింది. అయితే భార్య అనుపమ్ ఎన్నో ప్రయత్నాల తర్వాత ఏడేళ్ళ కంటే ముందే భర్తను బయటికి తీసుకొచ్చింది.
జైలు నుంచి వచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్ అనే పేరు తెచ్చుకున్న షైనీ.. అందరి దృష్టిలో బ్యాడ్ బాయ్‌గా మారిపోయాడు. గత పదేళ్లుగా ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు షైనీ అహూజ. అతని స్నేహితుడు, రచయిత మనీష్ గుప్తా ఈ కేసును ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని 2019లో లీగల్ డ్రామాగా వచ్చిన ‘సెక్షన్ 375’ చిత్రానికి కథను రెడీ చేశారు. అరెస్ట్ సమయంలో షైనీతో, రేప్‌కి గురైన అమ్మాయితో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు మనీష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



