మా నాన్న ఆస్తిని ఇప్పించండి.. కోర్ట్ గుమ్మం ఎక్కిన స్టార్ హీరోయిన్ పిల్లలు
on Sep 9, 2025

భారతీయ సినీ జగత్తులో 'కపూర్' ఫ్యామిలీది ఘనమైన చరిత్ర. తొమ్మిదిన్నర దశాబ్దాల క్రితమే 'పృథ్వీరాజ్ కపూర్'(Prithviraj kapoor)తో ప్రారంభమైన 'కపూర్' ల సినీ ప్రస్థానం నేటికీ బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది. ఎంతో మంది హీరోయిన్లు కూడా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అలాంటి వాళ్లలో ఒకరు 'కరిష్మా కపూర్(Karisma Kapoor). మరో హీరోయిన్ కరీనా కపూర్ సోదరి అయిన కరిష్మా, 1991 లో తెలుగు 'ప్రేమఖైదీ' కి రీమేక్ గా తెరకెక్కిన 'ప్రేమ్ ఖైదీ' తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో అగ్ర హీరోలతో జతకట్టి అగ్ర నటిగా ఎదిగింది. 2003 లో బిజినెస్ మాన్ 'సంజయ్ కపూర్' ని వివాహం చేసుకుంది. ఆ ఇద్దరకీ సమేరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉండగా, 2016 లో అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సంజయ్ కపూర్ ప్రియా సచ్ దేవ్ ని పెళ్లి చేసుకున్నాడు. గత జూన్ 12 న సంజయ్ కుమార్ గుండెపోటుతో మరణించడం జరిగింది.
రీసెంట్ గా సంజయ్ కుమార్ పిల్లలు ఢిల్లీ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. సదరు పిటిషన్ లో 'మా తండ్రి వీలునామా విషయంలో సవతి తల్లి ప్రియాసచ్ దేవ్ మోసం చేసింది. మా నాన్న రాసిన అసలు వీలునామాని దాచిపెట్టి నకిలీ వీలునామాని ఇటీవల జరిగిన ఫ్యామిలీ మీటింగ్ లో చూపించింది. మా నాన్న మరణాంతరం ఆస్థి వివరాలు చెప్పేందుకు గాని, సంబంధిత పత్రాలు కూడా చూపించేవారు కాదు. దయ చేసి ఆస్తిలో మాకు రావాల్సిన వాటా మాకు ఇప్పించండని పిటిషన్ లో పేర్కొన్నారు.
సోనా కామ్‌స్టార్(Sona comstar)అనే కంపెనీకి సంజయ్ కపూర్(Sunjay kapur)ఛైర్మన్ గా ఉన్నాడు. ఈ సంస్థ భారతీయ ఆటోమోటివ్ విడిభాగాల తయారీకి సంబంధించి డిఫరెన్షియల్ గేర్లు, స్టార్టర్ మోటార్లు, సెన్సార్లు, మరియు ఇతర ఈవిభాగాలని ఉత్పత్తి చేస్తుంది. అనేక దేశాల్లో సోనా కామ్‌స్టార్ కి తయారీ యూనిట్స్ ఉన్నాయి. సంజయ్ కపూర్ ఆస్థి విలువ సుమారు 30000 వేల కోట్ల రూపాయలని అంచనా.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



