ప్రముఖ బాలీవుడ్ నటుడు రమేశ్ దేవ్ కన్నుమూత
on Feb 3, 2022

వెటరన్ బాలీవుడ్ యాక్టర్ రమేశ్ దేవ్ ఇకలేరు. ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో ఆయన మృతిచెందారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. రమేశ్ దేవ్ బుధవారం రాత్రి 8:30 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అజింక్య దేవ్ వెల్లడించారు. "నాన్నకు హార్ట్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది." అని అజింక్య చెప్పారు. Also read: హృతిక్ కొత్త గాళ్‌ఫ్రెండ్ ఇదివరకు మరొకరితో సహజీవనంలో ఉంది!
"నాన్నకు తీవ్ర గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. కానీ ఆయన దక్కలేదు" అని ఆయన తెలిపారు. దేవ్‌కు భార్య సీమా దేవ్ (పాపులర్ నటి), ఇద్దరు కొడుకులు అజింక్య దేవ్, అభినవ్ దేవ్ ఉన్నారు. అభినయ్ హిందీ సినిమాలు 'ఢిల్లీ బెల్లీ', 'బ్లాక్‌మెయిల్'ను డైరెక్ట్ చేశాడు. అజింక్య హిందీ, మరాఠీ సినిమాల్లో పాపులర్ యాక్టర్. Also read: 'ఆదిపురుష్' 20 వేల థియేటర్లలో రిలీజవనుందా?
రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన 'ఆర్తి' (1962) సినిమాతో రమేశ్ బాలీవుడ్‌లో నటునిగా అడుగుపెట్టారు. 'ఆనంద్' (1971)లో ఆయన చేసిన డాక్టర్ ప్రకాశ్ కులకర్ణి పాత్రను అభిమానులు మర్చిపోలేరు. ఈమధ్య కాలంలో 'జాలీ ఎల్ఎల్‌బీ', 'ఘాయల్ ఒన్స్ అగైన్' సినిమాల్లో కనిపించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



