'గంగూబాయ్'లో ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన అజయ్ దేవ్‌గణ్!
on Feb 3, 2022

అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన 'గంగూబాయ్ కథియవాడి'లో ఓ కీలక పాత్ర చేసిన అజయ్ దేవ్‌గణ్, తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశాడు. సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈలోగా రేపు (ఫిబ్రవరి 4) ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. పోస్టర్‌లో అజయ్ దేవ్‌గణ్ ఓ కారుకు ఆనుకొని నిల్చొని పోజు ఇచ్చాడు. ఆయన వైట్ ప్యాంట్, షర్ట్, గ్రే కలర్ బ్లేజర్ ధరించి వున్నాడు. తలకు బ్లాక్ క్యాప్, కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకున్నాడు. Also read: 'పుష్ప' లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుంది.. గరికపాటి సెన్సేషనల్ కామెంట్స్
ఆ పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన, ''Apni pehchaan se chaar lagane, aa rahe hai hum! Trailer out tomorrow. #GangubaiKathiawadi in cinemas on 25th Feb, 2022. #SanjayLeelaBhansali @aliaabhatt @jayantilalgadaofficial @penmovies @bhansaliproductions @saregama_official." అని రాసుకొచ్చాడు. Also read: #SSMB28 లాంఛనంగా మొదలైంది
రెండు దశాబ్దాల పైగా సుదీర్ఘ విరామంతో సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పనిచేశాడు అజయ్. ఇదివరకు వారి కాంబినేషన్‌లో 'హమ్ దిల్ దే చుకే సనమ్' (1999) లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ వచ్చింది. అలాగే 'ఆర్ఆర్ఆర్' మూవీ తర్వాత ఆలియాతో అజయ్ కలిసి నటించిన సినిమా ఇది. ఒక వేశ్యావాటికకు అమ్ముడుపోయిన ఓ అమ్మాయి కామాఠిపురలోనే కాకుండా, ముంబై మహానగరంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఎలా ఎదిగిందనేది ఈ సినిమాలోని ప్రధానాంశం. హుస్సేన్ జైదీ పుస్తకం 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై'లోని ఓ చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని భన్సాలీ రూపొందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



