తన బర్త్‌డే సెలబ్రేషన్స్ చూసి.. లైవ్‌లో కంటతడి పెట్టుకున్న అమితాబ్!
on Oct 10, 2023
అమితాబ్ బచ్చన్... ఈ పేరు తెలియని వారు భారత దేశంలో లేరు అంటే అతిశయోక్తి కాదు, కొన్ని దశాబ్దాలపాటు తన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ దేశంలోనే కాదు విదేశాల్లోనూ అభిమానుల్ని ఏర్పరచుకున్న సలక్షణ నటుడు అమితాబ్. 80 సంవత్సరాల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కెబిసి షోను నిర్వహిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. కెబిసితో తనపై అందరికీ ఉన్న అభిమానాన్ని రెట్టింపు చేసుకున్నారు అమితాబ్. అక్టోబర్ 11కి 80 సంవత్సరాలు పూర్తి చేసుకొని 81వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు వేడుకను కౌన్ బనేగా కరోడ్‌పతి నిర్వాహకులు ముందుగానే ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ హాజరయ్యారు. అనంతరం ఒక పెద్ద ఆర్కెస్ట్రాతో అమితాబ్ సినిమాల్లోని కొన్ని పాటలను ఇన్‌స్ట్రుమెంటల్‌గా ప్రజెంట్ చేశారు. ఈ పాటలను అమితాబ్ ఎంతో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, తోటి నటీనటులు అందరూ వీడియో ద్వారా అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజును అంత గ్రాండ్‌గా చేసిన నిర్వాహకులకు థాంక్స్ చెప్పారు. ఆ ఏర్పాట్లను చూసి అమితాబ్ ఎమోషనల్ అయిపోయి లైవ్‌లోనే కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన కెబిసి ప్రోమోలో బిగ్‌బి భావోద్వేగానికి లోనై ‘ఇంకా నన్ను ఎంత ఏడిపిస్తారు? ఈ షోలో ఎమోషనల్ అయిన వారికి నేను టిష్యూ ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకూ ఒకటి కావాలి. ఇప్పటివరకు నేను జరుపుకున్న పుట్టినరోజు వేడుకల్లో ది బెస్ట్ సెలబ్రేషన్ కెబిసిలో జరుపుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆ ప్రోమోలో తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో అమితాబ్ ఫోటో వున్న హుడీలను ఆడియన్స్ ధరించారు.
ఇప్పటివరకు 1100కి పైగా కెబిసి షోకి హోస్ట్‌గా వ్యవహరించిన అమితాబ్ ఇంకా అదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో ఇకపై వచ్చే షోలను కూడా చేసి అందర్నీ అలరించాలని కోరుతూ అమితాబ్ బచ్చన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగు వన్ డాట్ కామ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



