నన్ను లొంగ దీసుకోవడానికి భారీ ఆఫర్..కంగనా సంచలన కామెంట్స్
on Oct 9, 2023

సాధారణంగా ఒక హీరోయిన్ విషయానికి వచ్చే సరికి అభిమానులు ,సినీ అభిమానులు ఇద్దరు కూడా తమ హీరోయిన్ నుంచి ఏ సినిమా విడుదల కాబోతుంది అలాగే ఏ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది అనే విషయాలని తెలుసుకోవాలని చూస్తారు. కానీ ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం మా హీరోయిన్ ఈ రోజు ఏ సంచలన వార్త బయటికి చెప్పింది అని తెలుసుకోవాలని ఎదురుచూస్తుంటారు. సంచలనం అనే పదానికి పర్యాయ పదమే ఆ హీరోయిన్.. ఆ హీరోయిన్ ఎవరో కాదు కంగనా రనౌత్ . ఇప్పుడు తాజాగా నన్ను ఎప్పటికప్పుడు లొంగ దీసుకోవాలని చెప్పి కొన్ని కోట్లరూపాయిల డబ్బులు ఆఫర్ చేసారు అని బాలీవుడ్ మీద మరో బాంబు వేసింది.
కంగనా రనౌత్.ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారు లేరు. సరి కొత్త లేడీ బ్రాండ్ గా తప్పు చేస్తున్న వారి గురించి బయట ప్రపంచానికి చెప్పి తప్పుడు వాళ్ళకి చెమటలు పట్టిస్తూ ఉంటుంది. కంగనా నిత్యం బాలీవుడ్ చిత్ర పరిశ్రమమీద, చిత్ర పరిశ్రమకి చెందిన పెద్దల మీద ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంటుంది.తాజాగా కంగనా ఒక బెట్టింగ్ యాప్ పై ఆరోపణలు చేసింది. తను చేసిన ఆరోపణలన్నిటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది
కంగనా పోస్ట్ చేసిన వివరాల ప్రకారం మహాదేవ్ అనే బెట్టింగ్ యాప్ వాళ్ళు తమ యాప్ ని ప్రమోట్ చెయ్యమని కంగనాని సంప్రదించారట. కాని కంగనా అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ వాళ్ళ ఎంతో మంది జీవితాలు సర్వనాశనం అవుతాయని ప్రమోట్ కి కంగనా ఒప్పుకోలేదు . యాప్ వాళ్ళు భారీ మొత్తం లో అమౌంట్ ఇస్తామని చెప్పినా కంగనా ఒప్పుకోలేదు. ఆ విధంగా ఒకటికి రెండు సార్లు మహాదేవ్ బెట్టింగ్ యాప్ వాళ్ళు కంగానని కలిసి తమ యాప్ కి ప్రమోట్ చెయ్యమని కొన్ని కోట్ల రూపాయిలు ఇస్తామని అన్నారు.
అయినా సరే కంగనా ఒప్పుకోలేదు. ఇంక అంతటితో యాప్ నిర్వహకులు వేరే వాళ్ళతో తమ ప్రమోషన్ ని ఇప్పించుకున్నారు. మహదేవ్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు రణబీర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రణబీర్ కపూర్‌కు కొంతకాలం క్రితం ఈ.డి సమన్లు కూడా పంపింది. ఇప్పుడు శ్రద్ధా కపూర్, కపిల్ శర్మ, సోనాక్షి సిన్హా, హుమా ఖురేషీతో సహా పలువురు ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. కంగనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి ఒప్పుకోలేదనే విషయం తెలుసుకున్న కంగనా ని ఆమె అభిమానులు తో పాటు ఇతరులు కూడా మెచ్చుకుంటున్నారు. రియల్ హీరోయిన్ కంగనా అని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



