మూడో భార్యని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నాను..దటీజ్ అమీర్ ఖాన్
on Jun 2, 2025

భారతీయ సినీప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'అమీర్ ఖాన్'(Aamir Khan). సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటిస్తు అశేష అభిమానులని సంపాదించాడు. ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాల జాబితాలో అమీర్ నటించిన 'దంగల్' మూవీనే ఉందంటే అమీర్ ప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. వ్యక్తి గత విషయానికి వస్తే తన రెండో భార్య 'కిరణ్ రావు' నుంచి విడాకులు తీసుకున్న అమీర్, చాలా కాలంగా ఒంటరిగానే ఉంటు వస్తున్నాడు. కానీ మార్చిలో జరిగిన తన 60 వ పుట్టిన రోజు సందర్భంగా' గౌరీ స్ప్రాట్ '(Gauri Spratt)అనే ఆమెతో డేటింగ్ లో ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు.
రీసెంట్ గా ఈ విషయంపై అమీర్ మాట్లాడుతు నేను 'గౌరీ' ని కలవడానికి ముందుకు థెరపీ చేయించుకున్నాను. దీంతో నా ఆరోగ్యంపై దృష్టి పెట్టి, నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. అనుకోకుండా కలిసిన మా ఇద్దరి మధ్య కొన్నాళ్లకి ప్రేమ పుట్టింది. గౌరీ, నేను భార్య భర్తలం కాకపోవచ్చు. కానీ ఎప్పటికి కలిసే ఉంటాం. పిల్లలు, తల్లి తండ్రులు ఉన్నారు కదా, భాగస్వామ్యం అవసరం ఏముందని అనుకున్నాను. కానీ గౌరీ ప్రేమతో అవసరం తెలిసింది. నా స్నేహితులు కూడా ప్రతి విషయంలో మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చాడు.
బెంగళూరుకు చెందిన గౌరీ లండన్ లో ఎఫ్‌డీఏ 'స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ'లో శిక్షణ పొందింది. ముంబై, బెంగళూరులలో గౌరీ కుటంబానికి కొన్ని సెలూన్స్ ఉన్నాయి.అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో చాలా కాలం నుంచి పని చేస్తూ వస్తుంది. ఆమెకు ఆరేళ్ల పాప కూడా ఉంది. ఇక అమీర్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ఈ నెల 6 న 'తారే జమీన్ పర్' కి సీక్వెల్ గా తెరకెక్కిన 'సితారే జమీన్ పర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత తన కలల ప్రాజెక్టు 'మహాభారతం' ని తెరకెక్కించాలనే పట్టుదలతో అమీర్ ఉన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



