English | Telugu
లిల్లీ అంటే చెల్లి అనుకున్నా కానీ పిల్లా!
Updated : Jul 21, 2022
జీ తెలుగులో ప్రతీ వారం ప్రసారమవుతున్న 'జీ సూపర్ ఫ్యామిలీ' షో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇక రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో 'ప్రేమ ఎంత మధురం' టీమ్, 'అగ్ని పరీక్ష' టీం మధ్య పోటీలు జరగబోతున్నాయి. ఈ ఎపిసోడ్ లో ప్రదీప్ 'అగ్నిపరీక్ష' హీరోయిన్ తనూజతో మస్త్ ఫన్ చేశాడు. ఆమెను "మీరు ఏ ఎగ్జామ్ లో బెస్ట్?" అని అడిగాడు ప్రదీప్. "ఇంట్లో హ్యాపీగా నా లిల్లీతో స్పెండ్ చేస్తా.. కొత్త కొత్తగా కుకింగ్ నేర్చుకుంటా" అని చెప్పింది తనూజ.
"గ్రీన్ టీ వండుతారా?" అని అడిగాడు ప్రదీప్. "హా" అని ఆన్సర్ ఇచ్చింది అమాయకంగా తనూజ. ఆ ఆన్సర్ కి అందరూ నవ్వేశారు. "ఈసారి లిల్లీని తీసుకురండి" అని చెప్పాడు ప్రదీప్.. "వద్దు దిష్టి తగులుద్ది" అంది తనూజ.. "లిల్లీ అంటే చెల్లి అనుకున్నా కానీ పిల్లా!" అని నవ్వుతాడు ప్రదీప్.
తర్వాత 'రామారావు ఆన్ డ్యూటీ' టీమ్ స్టేజి మీదకు వచ్చి సందడి చేసింది. "డైరెక్టర్ గారు చూసారా.. అమ్మాయిలను చూసి బ్యూటిఫుల్ గర్ల్స్ అన్నారు. మిమ్మల్ని కనీసం హ్యాండ్సమ్ అని కూడా అనలేదు" అని యాక్టర్ వేణుతో అన్నాడు ప్రదీప్. "అవసరం లేదండి.. అందరికీ తెలుసు నేను అందగాడినని" అంటూ కౌంటర్ వేశాడు వేణు. తర్వాత "వేణు గారు మీరు ఏ వంట బాగా చేస్తారు?" అని అడిగాడు ప్రదీప్.. "కాఫీ బాగా వండుతాను" అని పంచ్ వేశాడు వేణు.
తనూజ 'బొంబాయి' చిత్రం నుంచి "కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే" సాంగ్‌కు అద్దిరిపోయే డాన్స్ చేసి అందరినీ మైమరిపించింది. అలాగే 'అగ్ని పరీక్ష టీమ్'లో సెకండ్ హీరోయిన్ కి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాడు ప్రదీప్. అందులో కోడి, గుడ్లు బొమ్మ గీసిందామె. "ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రశ్న.. కోడి ముందా గుడ్డు ముందా?" అంటూ అడిగాడు ప్రదీప్. ఇలా రాబోయే వారం ఎపిసోడ్ ఫన్ చేయబోతోంది.