English | Telugu

'మా ముందు వీళ్లంతా జుజుబీ' అంటూ దివిని వెక్కిరించిన సన్నీ

'ఒక కింగ్... కింగ్ మీద గెలవడానికి వెళ్తే అది బ్యాటిల్. అదే ఒక క్వీన్.. కింగ్ మీద గెలవడానికి వెళ్తే అది బిగ్ బ్యాటిల్.'.. ఈ లైన్ తో 'బిగ్ బ్యాటిల్: కింగ్స్ వర్సెస్ క్వీన్స్' షో స్టార్ట్ కాబోతోంది. "కాంపిటీషన్ మా స్టాండర్డ్ లో ఉండే వాళ్ళతో పెట్టాలి కానీ వీళ్ళతో ఏమిటి? మా ముందు వీళ్లంతా జుజుబీ" అంటూ దివి గ్యాంగ్ ని వెక్కిరించాడు వీజే సన్నీ.

"తుఫాన్ వచ్చేముందు కూడా క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుంది. తర్వాతే చాలా వయొలెంట్ గా ఉంటుంది" అంటూ కౌంటర్ ఇచ్చిందిబిందుమాధవి. బిగ్ బాస్ లో ఉండే థ్రిల్ మొత్తాన్ని ఈ ఎపిసోడ్ లో చూపించబోతున్నారు మేకర్స్ . 'బిగ్ బ్యాటిల్: కింగ్స్ వర్సెస్ క్వీన్స్' పేరుతో మరో స్పెషల్ షోతో వచ్చేసింది పాపులర్ రియాలిటీ టీవీ సిరీస్ బిగ్ బాస్ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 5 విజేత VJ సన్నీ టీమ్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తుండగా, బిగ్ బాస్ నాన్-స్టాప్ విజేత బిందు మాధవి టీమ్ క్వీన్ నాయకురాలు.

బిగ్ బాస్ కంటెస్టెంట్లు రవికృష్ణ, దివి, మెహబూబ్, అనిల్ రాథోడ్, శివ, మహేష్ విట్టా, రోల్ రైడా, భాను శ్రీ, అరియానా గ్లోరీ, సిరి హన్మంత్, అవినాష్ వంటి చాలామంది ఈ స్పెషల్ షోలో భాగం కానున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఈ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రవి హోస్ట్ చేస్తున్న ఈ స్పెషల్ షో జూలై 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఇక ఎపిసోడ్ లో బిగ్ బ్యాటిల్ కింగ్స్ v/s క్వీన్స్ ఎపిసోడ్ లో ఎవరు ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడాలి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.