English | Telugu
సింగర్ పార్వతి ఊరిలో హైపర్ ఆది ఫోటో!
Updated : Jul 15, 2024
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా పార్వతి ఎంట్రీ ఇచ్చింది. పార్వతి అంటే చాలు అందరికీ గుర్తొచ్చేది విషయం ఊరికి బస్సు వేయించిన సరిగమప సింగర్ పార్వతి..పార్వతి అంటే పాట ఎలా గుర్తొస్తుందో ఊరికి బస్సు కూడా అలాగే గుర్తొచ్చేస్తుంది. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీకి స్పెషల్ కలర్ అద్దడానికి సరిగమప సింగర్స్ శ్రీచరణ్-పార్వతి వచ్చారు. ఇక వాళ్ళు పాడిన పాటలకు ఇంద్రజ ఫుల్ ఫిదా ఐపోయింది.
ఇక లాస్ట్ లో ఒక సెగ్మెంట్ పెట్టింది రష్మీ. "శ్రీదేవి డ్రామా కంపెనీ ఫొటోస్ తో పాటు మెమోరీస్ కూడా ఇవ్వబోతోంది" అనే సెగ్మెంట్ అది. ఇందులో నచ్చినవాళ్లతో ఫొటోస్ తీసుకుని వాళ్ళ వాళ్ళ మెమోరీస్ ని షేర్ చేసుకున్నారు. ఇందులో హైపర్ ఆది సింగర్ పార్వతితో ఫోటో దిగాలని కోరుకున్నాడు. ఇక పార్వతి కూడా స్టేజి మీదకు వచ్చి ఆదితో ఫోటో దిగింది. "పార్వతికి జబర్దస్త్ వాళ్లంటే చాలా ఇష్టం అని చెప్పింది.. ఇక ఈ ఫోటోని తన ఊరి వాళ్లందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అన్నాడు ఆది. ఈ రాబోయే ఎపిసోడ్ కి పార్వతిని తీసుకురావడంతో నెటిజన్స్ నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.. పార్వతిని తీసుకురావడం చాలా గ్రేట్ గా ఉంది. పార్వతి వాయిస్ నేచురల్ గా ఉంటుంది." అంటున్నారు. ఇక పార్వతి సరిగమప జడ్జెస్ కి కూడా ఎంతో నచ్చిన వాయిస్..కోటి గారు కూడా పార్వతి గాత్రాన్ని బాగా ఆస్వాదించారు.