English | Telugu
కార్తీక్ ఎమోషనల్.. నా ఎంగేజ్ మెంట్ ఆ దీప చూడాలి!
Updated : Jul 14, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -96 లో....గుడిలో సుమిత్ర దీపని చూస్తుంది. ఎందుకు వెళ్ళావంటే సమాధానం చెప్పదు. వచ్చేవారం జ్యోత్స్న, కార్తీక్ లకి ఎంగేజ్ మెంట్.. నువు తప్పకుండా రావాలి. నా చిన్న కూతురు ఎంగేజ్ మెంట్ కి పెద్ద కూతురు కంపల్సరీ రావాలని సుమిత్ర రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత సుమిత్ర వెళ్ళాక.. అమ్మ గుడికి అందరు వచ్చారు. కార్తీక్ రాలేదేంని శౌర్య అడుగుతుంది. నాకేం తెలుసని దీప ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు దీప ఉండి వెళ్లిన అవుట్ హౌస్ కి కార్తీక్ వెళ్లి.. శౌర్య బుక్స్ చూసి ఎమోషనల్ అవుతాడు. అక్కడే దీప కార్తీక్ ఇవ్వాల్సిన డబ్బుల బాక్స్ ని చూస్తాడు. అది ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉంటాయి. అందులో మీ డబ్బులు మీకు గడువులోగా ఇస్తాననే చీటీ రాసి ఉంటుంది. అది చూసి ఇంత నిజాయితీ ఏంటి దీప అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ బయటకు వస్తాడు. అప్పుడే పారిజాతం వచ్చి.. ఏంటి జ్ఞాపకాలు వెతుకుంటున్నావా అని అడుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ .. నాకు పెళ్లి ఇష్టం లేదన్నా కదా అని కార్తీక్ అంటాడు. ఈ విషయం అత్తయ్య వాళ్ళు వచ్చాక చెప్తానని కార్తీక్ అనగానే.. చెప్తే మీ అమ్మ బతకదని పారిజాతం అంటుంది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని కార్తీక్ అంటాడు. అప్పుడే సుమిత్ర వాళ్ళు గుడి నుండి వస్తారు. శుభవార్త వినాలని నేను నా మనవడు ఎదురు చూస్తున్నామని పారిజాతం అంటుంది. పారిజాతం ప్రవర్తన వల్ల కార్తీక్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న రాగానే పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముహూర్తం గురించి చెప్తుంది. కార్తీక్ వెళ్తుంటే సుమిత్ర పిలిచి.. దీప కన్పించిందని చెప్తుంది.
ఆ తర్వాత కార్తీక్ కార్.. దీప వెళ్లే అటో పక్కనే వెళ్తుంది. కార్తీక్ అంటూ శౌర్య అంటుంది. ఆటో ఫాస్ట్ గా వెళ్ళమని శౌర్యా అంటుంది. అవసరం లేదని దీప అంటుంది. మరొకవైపు దీప ఇక్కడే ఉందిమ మనం ఎంగేజ్ మెంట్ రోజు ఇక్కడే ఉంచాలి. నా ఎంగేజ్ మెంట్ అది చూడాలి.. ఎలాగైనా ఎక్కడ ఉందో కనిపెట్టాలని జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.