English | Telugu

నిబ్బానిబ్బి వేషాలు మానేయండి..వార్నింగ్ ఇచ్చిన యూట్యూబర్ నిఖిల్

వాలెంటైన్స్ డే రాబోతోంది. ఈ డే వచ్చే ముందు వారం అంతా రోజ్ అని, చాక్లెట్ డే అని రకరకాలుగా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. లవర్స్ ఉన్న వాళ్ళు ఓకే అదే సింగల్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ? మరి నిఖిల్ విజయేంద్ర సింహ కూడా అదే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తోంది.

ఈ వాలెంటైన్స్ డే మీద ఒక ఫన్నీ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "ఈ దిక్కుమాలిన వాలెంటైన్ వీక్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. రోజ్ డే, టెడ్డీ డే, గాడిద గుడ్డు డే, కొత్తిమీర డే, కరివేపాకు డే అనేది మొదలవుతుంది..దయచేసి ఆ ఫోజలు, ముద్దులు పెట్టుకునే వీడియోస్, లవ్ స్టోరీస్ పెట్టకండి...మా మనోభావాలు దెబ్బతింటాయి. ఈ నిబ్బానిబ్బి వేషాలు వేయడం మానేయండి. మాకు తెలుసు మీ ప్రేమ గురించి, మీరు చేసుకునే యానివర్సరీల గురించి ఏదైనా చేసుకోండి. కానీ నేను సింగల్ కాబట్టి నా లాంటి సింగిల్స్ ఎవరైనా ఇదే ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తూ ఉంటే కామెంట్ చేయండి..నాకు కూడా తోడు, నీడ, జాడ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతాను" అని చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో కింద సురేఖావాణి కూతురు సుప్రీతా "బాగా మండుతున్నట్టు ఉంది అనుకుంటా" అని రిప్లై ఇచ్చింది. సినిమా నటి అర్చన అలియాస్ వేద నవ్వుతున్న ఎమోజిస్ పెట్టింది.

"ఐతే ఏమిటి నువ్వు తొందరగా పెళ్లి చేసుకో ..లేదా ఒక అమ్మాయిని ఇంప్రెస్స్ చెయ్యి..వాళ్ళేదో సెలెబ్రేట్ చేసుకుంటే నీకెందుకు బాధ ? నువ్వు సింగల్ అంటే ఎవరూ నమ్మరు" అని కొంతమంది కామెంట్స్ చేస్తే " అది వాలెంటైన్స్ డే కాదు అది బ్లాక్ డే ఎంతోమంది జవాన్లు చనిపోయిన రోజు..వాళ్ళను గౌరవిద్దాం...వాళ్లకు రుణపడి ఉందాం" అంటూ కొంతమంది రిప్లై ఇచ్చారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.