English | Telugu

జ్యోతక్క ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం

కొత్త ఏడాది ఇలా మొదలయ్యిందో లేదో బుల్లితెర స్టార్స్, యూట్యూబర్స్ అంతా కొత్త కొత్త ముచ్చట్లు చెప్తున్నారు. కార్లు, బైక్లు, ఇళ్ళు కొనుక్కుంటున్నారు..ఇప్పుడు జ్యోతక్క కూడా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. దానికి సంబంధించిన ఒక వీడియోని తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.

రీసెంట్ ఆమె తన అత్తారింటికి సంబంధించిన ఒక వీడియోని పోస్ట్ చేసి ఆ ఇంటి ఇంటీరియర్ మొత్తం కూడా పాడైపోయింది అని చెప్పి బాధపడింది. ఇప్పుడు ఆ ఇల్లు మొత్తాన్ని మళ్ళీ ఫ్రెష్ గా రెనోవేషన్ చేయించి ఆ ఇంట్లోకి మళ్ళీ గృహప్రవేశం చేశారు జ్యోతక్క అండ్ ఫామిలీ.. ఈ సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని వీడియో తీయించింది శివజ్యోతి. ఇంటికి వచ్చిన ముత్తైదువులు కాళ్లకు పసుపు రాయడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మొత్తం చూపించింది. ఇంట్లో పూజ కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు.

తర్వాత జ్యోతక్క ఫేవరేట్ దేవుడు వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్లారు. తీన్మార్ వార్తలతో ఫేమస్ ఐన శివ జ్యోతి తెలంగాణ యాసలో మాట్లాడుతూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. జ్యోతక్కకు ఏమాత్రం ఖాళీ దొరికినా తన భర్తతో కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళిపోతుంది..అక్కడి వీడియోస్ ని కూడా అప్ డేట్ చేస్తూ ఉంటుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.