English | Telugu

జగతి, మహేంద్రల ప్లాన్ నెరవేరుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. టెలివిజన్ రంగంలో అత్యంత ఎక్కువ TRP తో దూసుకెళ్తున్న ఈ సీరియల్ ఎపిసోడ్ -680 లొకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో.. వసుధార ప్రాజెక్ట్ గురించి రిషికి వివరిస్తుంది. ఎలాగైనా వసుధార నుంచి నిజం తెలుసుకోవాలని రిషి ట్రై చేస్తుంటాడు. అయితే వసుధార ఏ మాత్రం తెలియనివ్వదు.

మరొకవైపు రిషి, వసుధార లను కలిపే ప్రయత్నంలో జగతి, మహేంద్రలు చక్రపాణి దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. ఇద్దరిని దూరంగా ఎక్కడికైనా పంపిద్దాం. అప్పుడు వాళ్ళకి ఎక్కువ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు.. కానీ కాలేజీలో ఉన్నంత వరకే కదా... అలా ఇద్దరిని దూరంగా పంపిస్తే, ఒకరి గురించి ఒకరికి పూర్తిగా అర్ధం అవుతుందని జగతి చెప్తుంది. దానికి చక్రపాణి సరే అంటాడు.

ఆటో కోసం వెయిట్ చేస్తున్న వసుధార దగ్గరికి రిషి వచ్చి.. లిఫ్ట్ ఏమైనా కావాలంటే అడుగు అనేసరికి.. "నాకెందుకు సర్ లిఫ్ట్. నేను ఇప్పుడు ప్రాజెక్ట్ హెడ్ ని శాలరీ బాగానే వస్తుంది. నేను క్యాబ్ లో వెళ్ళగలను. అయినా కొన్నాళ్ళకు కార్ కూడా కొంటాను. మీలాగే లిఫ్ట్ కూడా ఇస్తాను" అని వసుధార అంటుంది. పొగరుకేం తక్కువ లేదని రిషి అనుకుంటాడు. ఏం అంటున్నారు సర్ అని వసుధార అడుగుతుంది. ఏం లేదని చెప్తాడు. రిషి మనసులో "ఇద్దరం ప్రేమించుకున్నాం.. నన్ను మిస్ అయ్యానన్న బాధ కనిపించడం లేదేంటి మరిచిపోయిందా? అని అనుకుంటాడు. రమ్మని పిలవచ్చు కదా అని వసుధార, వస్తానని అనొచ్చు కదా అని రిషి అనుకుంటారు. సరే వస్తాను అని వసుధార, ఒకే రా అని రిషి ఇద్దరు ఒకేసారి అనుకుంటారు. ఇద్దరు కార్ లో వెళ్తూ మాట్లాడుకుంటారు.

రిషితో టూర్ గురించి ఎలా చెప్పాలని జగన్, మహేంద్ర టెన్షన్ పడుతారు. రిషి ఇంటికి వస్తాడు. "ఏమైనా చెప్పాలనుకుంటున్నారా డాడీ" అని భోజనం చేస్తూ రిషి అడుగుతాడు. ప్రాజెక్ట్ గురించి విలేజ్ టూర్ ప్లాన్ చేసామని మహేంద్ర అంటాడు. గుడ్ అని రిషి అంటాడు. రిషి, వసుధారలని దూరంగా పంపించి, వాళ్ళు అనుకున్న ప్లాన్ ని జగతి, మహేంద్రలు అమలు చేస్తారో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.