English | Telugu
Yawar Misbehaved with Tanuja: బిగ్ బాస్ హౌస్‌లో తనూజతో మిస్ బిహేవ్ చేసిన యావర్!
Updated : Nov 28, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం, వారితో హౌస్ లోని కంటెస్టెంట్స్ ని టాస్క్ లు ఆడుతుంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్, యావర్ ఎంట్రీ ఇచ్చారు. సీజన్-4 కంటెస్టెంట్ సోహెల్, సీజన్-7 కంటెస్టెంట్ యావర్. అయితే ఆ సీజన్ లో రతికరోజ్ తో యావర్ లవ్ ట్రాక్ నడపాలని చూశాడు కానీ అప్పటికే తను కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ తో లవ్ లో ఉండటంతో సైలైంట్ అయిపోయాడు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో యావర్ హౌస్ లోకి వచ్చీ రాగానే అందరిని నవ్వుతూ పలకరించాడు. హౌస్‌లో ఎవరూ చేయలేని పనిని యావర్ చేశాడు. అదేంటంటే తనూజతో పులిహోర. మామూలుగా కాదు.. తను చేసిన పనికి తనూజ అయితే ఇబ్బంది పడింది. హౌస్ లోకి రాగానే తనూజ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు. తను లేడని చెప్పడంతో మనోడు చెలరేగిపోయాడు. మోకాళ్ళ మీద కూర్చొని మరీ ప్రపోజ్ చేయడంతో తనూజకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత తనని ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు.
తనూజని యావర్ ఎత్తుకొని తిప్పుతున్నప్పుడు తను అన్ కంఫర్టెబుల్ గా ఫీల్ అయింది. అదంతా చూస్తూ కళ్యాణ్ మొహం మాడిపోయింది.ఇక ఆ తర్వాత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకురా మొత్తం ఊడిపోతుందని ఇమ్మాన్యుయల్ తో యావర్ అనగా.. స్ట్రెస్ గురించి నువ్వు చెప్తున్నావా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్, యావర్ మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగింది. ఇందులో యావర్ పై ఇమ్మాన్యుయల్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నిలిచాడు.