English | Telugu

యాభై వేలకి యష్మీ, నిఖిల్ ల లవ్ స్టోరీ చెప్పేసిన పృథ్వీ!

బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదో వారం‌ వీకెండ్ వచ్చేసింది. యష్మీ, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ వీళ్లంతా కన్నడ బ్యాచ్. అందుకే మొదట నుండి వీళ్ళు ఎవరితో కలవకుండా వీళ్ళే ఉంటు వస్తున్నారు. యష్మీ పాప నిఖిల్ ని లవ్ చేస్తున్నట్లు చెప్పేసింది. అయితే నిఖిల్ కి మాత్రం యష్మీ అంటే ఇష్టమున్నా కూడా బయట పడడం లేదు. కానీ యష్మీ మాత్రం తను అంటే ఇష్టమున్న గౌతమ్, నిఖిల్ లని ట్రాక్ లో పడేయ్యడానికి చూస్తుంది.

యష్మీ ఏం చేసినా కూడా నిఖిల్ జలస్ ఫీల్ అవ్వాలని చేస్తుంది.. ఆ విషయం నాగార్జున చెవిన పడ్డట్టుంది. యష్మీకి గౌతమ్ తినిపిస్తున్నాడని మాట్లాడుతుంటే అది వండింది మేమ్.. గౌతమ్ రెడీ గా ఉంది తీసుకొని యష్మీ దగ్గరికి వెళ్ళడని నిఖిల్ అనగానే..అంటే గౌతమ్ తినిపిస్తున్నాడని జలస్ ఆ అది మీరు వండింది అని అలా అంటున్నావా అని నాగార్జున అడుగుతాడు. నిఖిల్ ప్రాబ్లమ్ అన్నం, పప్పు కాదు.. టీ షర్ట్ ప్రాబ్లమ్ అని నాగార్జున అనగానే.. రైట్ సర్ అని పృథ్వీ అంటాడు. టీ షర్ట్ తో తుపాన్ అనేది ఒక సామెత అని నాగార్జున అంటాడు. కావాలంటే పృథ్వీని అడగండి.. పృథ్వీ ఆ విషయం చెప్తే యాభై వేలు ప్రైజ్ మనీకి ఆడ్ చేస్తానని నాగార్జున అనగానే.. అందరు చెప్పు చెప్పు అని అంటారు. యష్మీ, నిఖిల్ మాత్రం వద్దని అంటారు. అయిన పృథ్వీ చెప్తాడు.

గౌతమ్ ని యష్మీ టీ షర్ట్ అడిగింది. నిఖిల్ టీ షర్ట్ లేదు కాబట్టి అడిగింది. నిఖిల్ కి మండుతున్నట్లు ఉంది.. నిఖిల్ జలస్ గా ఫీల్ అవుతాన్నాడు.. అక్కడ నుండి ఏదైనా ఫీలింగ్ ఉందా అని యష్మీ అడిగిందంటు పృథ్వీ చెప్పాడు. అప్పుడే నిఖిల్ వచ్చి ప్రాబ్లమ్ ఓన్లీ టీ షర్ట్ అని చెప్పాడు. దాని ముందు జరిగింది చెప్పురా ఎందుకు ఇలా మార్చి చెప్తున్నావని యష్మీ అంటుంది. ఇక పృథ్వీని నాగార్జున కంటిన్యూ చేయమంటాడు. నెక్స్ట్ డే నే సాంగ్ వచ్చింది సర్.. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే అని పృథ్వీ అనగానే సి వచ్చి మళ్ళీ బి పై వాలిందంటూ నాగార్జున అంటాడు. దీన్ని బట్టి ఆర్య-3 కూడా తీయొచ్చు అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.