English | Telugu

హల్దీ ఫంక్షన్ లో ఈగకు సంతాపం ప్రకటించిన సింగర్ అండ్ ఫ్రెండ్స్!

సింగర్, `సరిగమప నెక్ట్స్ ఐకాన్‌` విన్నర్‌ ఐన యశస్వి కొండేపూడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `జాను` మూవీలోని `లైఫ్‌ ఆఫ్‌ రామ్‌` పాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌ సింగరైపోయాడు. యశస్వి మూవీస్ లో సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాడు. యశస్వికి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా తన చెల్లి సంకీర్తన హల్దీ ఫంక్షన్ వీడియోని అప్ లోడ్ చేసాడు. ఈ హల్దీ ఫంక్షన్ కి అందరూ కలిసి యెల్లో డ్రెస్సెస్ వేసుకుని, ఎల్లో జ్యువెలరీ పెట్టుకుని సెపరేట్ గా డెకరేట్ చేసిన ప్లేస్ కి వచ్చి అక్కడ ఫుల్ గా డాన్స్, హంగామా చేశారు. ఇక పెళ్ళికొడుకు, పెళ్లికూతురిని రాంప్ వాక్ చేయించారు. ఫైనల్ గా ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు.

ఒక వాటర్ బాటిల్ లో చనిపోయిన ఈగ కోసం అందరూ సంతాపం ప్రకటించారు. అందరూ నిలబడి " ఈగ ఓ మంచి ఈగ నువ్వు స్వర్గానికి వెళ్లాలని... వచ్చే జన్మలో మనిషిలా పుట్టి ఇంకొన్నేళ్లు బతకాలని అందరూ కోరుకుంటున్నారు..నువ్వు లేకపోవడం బాధగా ఉంది" అని ప్రతిజ్ఞ చేసి కాసేపు మౌనం పాటించారు. ఇలా అందరూ హల్దీ ఫంక్షన్ ని ఎంజాయ్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.