English | Telugu

ఖుష్బూ రొమాంటిక్ గా చూసేసరికి స్టేజి మీద పడిపోయిన హోస్ట్!

"డాన్స్ ఇండియా డాన్స్" మంచి కలర్ ఫుల్ గా ఫుల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్సెస్ తో అదరగొడుతోంది. ఇక ఈ వారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అతిలోక సుందరి, ది క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా ఖుష్భూ డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచంలోనే ఒక హీరోయిన్ కి టెంపుల్ కట్టారంటే అది ఖుష్బూ గారికే అని చెప్పి హోస్ట్ అకుల్ బాలాజీ ఆమెను ఇన్వైట్ చేసాడు.

ఇక మరో హోస్ట్ రౌడీ రోహిణి వచ్చి ఖుష్బూ గారిని ఆట పట్టించింది. మీరు క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా ఐతే నేను క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సింగర్స్ అని తనని తాను పరిచయం చేసుకుంది. ఇక ఖుష్బూ గారికి ఒక టాస్క్ ఇచ్చింది జడ్జి సంగీత. ఒక పది సెకన్లు రొమాంటిక్ గా అకుల్ వైపు క్షుష్బూ చూసేసరికి హోస్ట్ ఆ చూపుకు కింద పడిపోయాడు. తర్వాత హోస్ట్ అకుల్, జడ్జి ఆనంది కలిసి స్టేజి మీద "శుభలేఖ రాసుకున్న" అనే సాంగ్ కి రొమాంటిక్ గా డాన్స్ చేశారు. తర్వాత 80 స్ గ్యాంగ్ ఫోటోని షోలో చూపించారు.

తర్వాత అఖిల్ - సుధాన్షు ఇద్దరూ కలిసి సీతారామం మూవీలో సాంగ్ పాడి వినిపించారు. వాటి తర్వాత బాబా మాస్టర్ వచ్చి సింగర్ అవతారం ఎత్తారు. "వై థిస్ కొలవెరి" అనే సాంగ్ పాడి ఎంటర్టైన్ చేశారు. ఫైనల్ గా చంటి మూవీలోని "ఓ ప్రేమ..నా ప్రేమ" సాంగ్ కి ఖుష్బూ అద్దిరిపోయే ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.