English | Telugu

కంటెస్టెంట్స్ కామెడీ చేయడం లేదు...జడ్జెస్ కామెడీ చేస్తున్నారు!

ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాంప్రసాద్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ పెట్టి రన్ చేస్తూ ఉంటాడు. ఈ స్కిట్ లో కామెడీ పీక్స్ అని అర్థమైపోయింది. కంప్యూటర్ కి మదర్ బోర్డు లేదేంటండి అని కమెడియన్ బాబు అడిగేసరికి ఇదొక అనాధ..దీనికి అమ్మ ఉండదు అని పంచ్ వేసాడు. ఇక గెటప్ శీను రష్యా నుంచి వచ్చే ఆఫీసర్ పాత్రలో కనిపించి ఎంటర్టైన్ చేసాడు.

తర్వాత ఇండియాలో వస్తున్న జబర్దస్త్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ..ఐతే అందులో ఒక మైనస్ ఉంది అదేంటంటే కామెడీ మీద కాన్సంట్రేట్ చేయాలి కానీ రాంప్రసాద్ జుట్టు మీద కాదు అని కౌంటర్ వేసాడు గెటప్ శీను. అంతేకాదు జబర్దస్త్ లో కంటెస్టెంట్స్ ఎవరూ కామెడీ చేయడం లేదు జడ్జెస్ కామెడీ చేస్తున్నారు..అని అన్నాడు.

ఇక ఈ ఎపిసోడ్ లో రాంప్రసాద్ కి జుట్టు అంతగా కనిపించలేదు. ఎందుకంటే ఇటీవలే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.