English | Telugu

పడవలో ముద్దులతో రెచ్చిపోయిన‌ జ్యోతక్క!

తెలంగాణ యాసలో వార్తలు చదివే శివజ్యోతి అలియాస్ జ్యోతక్క అంటే మస్త్ ఫేమస్. ఐతే జ్యోతక్క గురించి చెప్పాలంటే బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్ తర్వాత అని చెప్పాలి. బిగ్ బాస్ కి ముందు జ్యోతక్క అంటే ఎక్కువ‌మందికి తెలీదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక సెలబ్రిటీ ఐపోయింది. జ్యోతక్కతో పాటు ఆమె భర్త గంగూలీ కూడా బుల్లి తెర మీద ఫుల్ ఫేమస్ అయ్యాడు. శివజ్యోతి అనేది అసలు పేరు. సావిత్రి అనేది ఆమె స్క్రీన్ పేరు.

సెలబ్రిటీ ఐపోయాక ఆ పాత శివజ్యోతిలో చాలా మార్పు వచ్చింది. డ్రెస్సింగ్ స్టైల్ మారింది. మస్త్ వీడియోస్ చేస్తూ, టీవీ షోస్ లో ఫుల్ మస్త్ చేస్తూ ఒక రేంజ్ లో వెలిగిపోతోంది. దీపం ఉండగానే ఇల్లు, కారు, స్టేటస్ అన్నిటిని చక్కబెట్టుకుంది జ్యోతక్క. యాసలో పెద్ద మార్పు రాలేదు కానీ వేష భాషల్లో మాత్రం చాలా మార్పు వచ్చేసింది. పొట్టిగా ఉండే మోడరన్ డ్రెస్సుల్లో తెగ హల్చల్ చేసేస్తోంది.

భార్యాభర్తలిద్దరూ కలిసి వాళ్ళ యూట్యూబ్ చాన‌ల్‌లో వీడియోస్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ లో, జోష్ యాప్ లో రీల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు జోష్ లో 'మై లవ్' అనే కాప్షన్ పెట్టి పడవలో వెళ్తూ జ్యోతక్క, గంగూలీ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటున్న రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.