English | Telugu
రాత్రివేళ ఒంటరిగా కారులో అను ఎక్కడికి వెళ్లింది?
Updated : Dec 29, 2021
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` వెంకట్ శ్రీరామ్, వర్ష హెచ్.కె కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగళూరు పద్మ, జయలలిత, జ్యోతిరెడ్డి, అనుషా సంతోష్, రామ్ జగన్, విశ్వమోహన్, కరణ్, వర్ష, ఉమాదేవి, మధుశ్రీ, రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ గత జన్మల నేపథ్యంలో సాగే ఫాంటసీ థ్రిల్లర్. తను ప్రేమించిన ఆర్య కోసం తిరిగొచ్చిన రాజనందిని కథగా ఈ సీరియల్ వరుస ట్విస్ట్ లతో విశేషంగా ఆకట్టుకుంటోంది.
బుధవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. మంగళవారం ఎపిసోడ్ లో జెండే (రామ్ జగన్) పై అనుమానం మొదలైన అను తనని వెంబడిస్తూ అతను ఎవరినో ఒంటరిగా కలవడానికి వెళుతున్నాడని పసిగట్టి అతన్ని వెంబడిస్తుంది. ఏకాంత ప్రదేశానికి చేరుకున్న జెండే `ఇక్కడ ఎవరూ లేరు నేను ఒక్కడినే వున్నాను వచ్చేయ్` అని ఎవరికో ఫోన్ చేస్తాడు. అదెవరో తెలుసుకునే లోపే ఇంటి దగ్గరి నుంచి ఫోన్ వస్తుంది. ఇది జరుగుతున్న క్రమంలోనే ఆర్య .. అను కోసం ఫోన్ చేస్తుంటాడు. కానీ అను అటెండ్ చేయదు. ఏం జరిగిందా? అని అంతా ఇంటికి చేరుకుంటారు.
కుక్కపై విష ప్రయోగం జరిగి చనిపోయిందని తెలుస్తుంది. తను సిద్ధం చేసిన కిళ్లీలను తిని కుక్క చనిపోయిందని శారదా దేవి బోరున విలపిస్తుంటుంది. ఆర్య, జెండే..శారదా దేవికి సర్దిచెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఇదంతా వశిష్ట గమనిస్తూ దొరికి పోతానా? అని అనుమానంతో చూస్తుంటాడు. ఇంతలో శారదా దేవి .. అను,ఆర్యలని పిలిచి అసలు విషయం చెబుతుంది. ఈ కిళ్లీలు మీ కోసం సిద్ధం చేసినవి.. అని చెబుతుంది. దీంతో షాక్ కు గురైన అనుకు తనని, ఆర్యని చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజ నందిని తనకు చెప్పిన మాటలుగుర్తొస్తాయి. ఇదే టైమ్ లో మాన్సీకి మీరా గట్టి ఝలక్ ఇస్తుంది.
కట్ చేస్తే.. తను రాజనందిని చెబుతున్న విషయాల్ని రాసుకున్న డైరీ కోసం అను వెతకడం మొదలుపెడుతుంది. డైరీ కనిపించకపోయే సరికి అను పనివాడిని ఆరా తీస్తుంది. ఈ లోగా అను కోసం బెడ్ రూమ్‌లో ఆర్య ఎదురుచూస్తూ వుంటాడు. ఇంతలో అను వచ్చింది గమనించి 'భోజనం చేశావా?' అని అడుగుతాడు. లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య కొంత చర్చ జరుగుతుంది. ఆ తరువాత అర్ధరాత్రి ఉన్నట్టుండి నిద్ర లేచిన అను నా ఆర్యకినేనుండగా ఏమీ జరగనివ్వను.. దీని వెనక వున్నది ఎవరో తెలుసుకుంటాను` అంటూ రాత్రి నడుచుకుంటూ వెళుతుంది. అది వశిష్ట గమనించి ఎవరికో ఫోన్ చేస్తాడు..
Also Read: 'ఆహా' మరో ట్విస్ట్.. బన్నీ 'అన్ స్టాపబుల్'కి బ్రేక్!
గతంలో రాజనందిని వాడిన కారు దుమ్ము పట్టి వుంటుంది. గేట్ ఓపెన్ చేసిన అను.. కార్ కవర్ తీసేసి ఒంటరిగా ఆ కారులో బయటికి బయలు దేరుతుంది. అది గమనించిన మాన్సి.. ఇంత రాత్రివేళ ఒంటరిగా అను ఎక్కడికి వెళుతోంది అని అనుమానిస్తుంది. అను కారు నందిని నిలయం ముందు ఆగుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? జరగబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.