English | Telugu

`కార్తీక దీపం` :  నీల‌వేణి  చేతిలో కార్తీక్ పెట్టిన  ఫైల్స్ ఏంటీ?

`కార్తీక దీపం` బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది . గ‌త కొన్ని వారాలుగా టాప్ వ‌న్ రేటింగ్‌తో కొన‌సాగుతున్న ఈ సీరియ‌ల్ ప్ర‌తీ రోజు చిత్ర విచిత్ర‌మైన ట్విస్ట్‌లు.. టర్న్‌ల‌తో సాగుతూ క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ‌త రేపుతోంది. మ‌హిళా ప్రేక్ష‌కుల్ని కంట‌త‌డి పెట్టిస్తూ దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ సీరియ‌ల్‌గా పేరు తెచ్చుకున్న `కార్తీక దీపం` ఈ సోమ‌వారం 1215వ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయి.

మోనిత మ‌త్తు టాబ్లేట్స్ ప్లాన్ వ‌ర్కవుట్ కావ‌డంతో కార్తీక్‌.. నీల‌వేణి భ‌ర్త మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతాడు. దీంతో నీల‌వేణి .. డాక్ట‌ర్ బాబుకు శాపనార్థాలు పెడుతుంది. నువ్వు.. నీ కుటుంబం, నీ పిల్ల‌లు స‌ర్వ‌నాశనం అవుతారంటూ శాప‌నార్థాలు పెడుతుంది. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి షాక్‌కు గురైన కార్తీక్ అవ‌మాన భారంతో ఇంటికి చేర‌తాడు. క‌ట్ చేస్తే .. కార్తీక్ ఇంట్లో పిల్ల‌లు, ఆదిత్య‌, సౌంద‌ర్య‌, ఆనంద‌రావు నవ్వుతూ సంతోషంగా మాట్లాడుకుంటూ వుండ‌గా .. పిల్ల‌లు `బాబాయ్ ఐస్ క్రీమ్ తినిపించ‌డానికి బ‌య‌టికి తీసుకెళ్లాలి` అని ప‌ట్టుబ‌డ‌తారు. ఇంత‌లో కార్తీక్ బాధ‌గా అగుడులో అడుగు వేస్తూ ఇంట్లోకి వ‌స్తాడు. పిల్ల‌లు వెళ్లి `డాడీ`.. అని హ‌గ్ చేసుకుంటే `మీకేం కాద‌మ్మా .. ఈమ‌రు బాగుంటారు` అని పైకి అనేసి జాగ్ర‌త్త‌గా తీసుకెళ్లి ఐస్‌క్రీమ్ కొనివ్వ‌మ‌ని ఆదిత్య‌ని పంపిస్తాడు.

సీన్ క‌ట్ చేస్తే.. కార్తీక్‌కు శాప‌నార్థాలు పెట్టిన నీలవేణి బ‌స్తీలో త‌న భర్త ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అంతా ఓదారుస్తూ వుంటారు. ఇంత‌లో కారు ఆగుతుంది. సౌంద‌ర్య కొన్ని ఫైల్స్ ప‌ట్టుకుని దిగుతుంది. వెంట‌నే కార్తీక్ కూడా దిగుతాడు. అప్ప‌టి దాకా భ‌ర్త ప‌క్క‌న ఏడుస్తూ వున్న నీల‌వేణి.. కార్తీక్‌ని చూసి ర‌గిలిపోతుంది. `అదిగో ఆ డాక్ట‌రే నా భ‌ర్త‌ని పొట్ట‌న‌బెట్టుకున్నాడు` అంటూ కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి `ఎందుకొచ్చావ్ అయ్యా.. అంటూ కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీస్తుంది. త‌న భ‌ర్త శ‌వం వ‌ద్ద‌కు కార్తీక్‌ని లాక్కెళుతుంది. కార్తీక్ చేసేది లేక మోకాళ్ల‌పై కూల‌బ‌డి.. నీల‌వేణి చేతులు ప‌ట్టుకుని ఆవేద‌న‌గా.. `నేను చేసింది త‌ప్పే.. నీ భ‌ర్త ప్రాణాల‌ను తిరిగి తీసుకురాలేను. కానీ నేను చెయ్య‌గ‌లిగింది ఒక్క‌టే అంటూ సౌంద‌ర్య చేతుల్లోని ఫైల్స్ ఆమె చేతుల్లో పెడ‌తాడు. ఇంత‌కీ నీలవేణి చేతిలో కార్తీక్ పెట్టిన ఫైల్స్ ఏంటీ? అందులో ఏముంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.