English | Telugu
మాకు గీతు వద్దు!
Updated : Oct 17, 2022
బుల్లితెరకి కొత్త గ్లామర్ ని, రేటింగ్స్ కి గ్రామర్ ని తీసుకొచ్చిన బిగ్ బాస్ కొత్తదనాన్ని మోసుకొచ్చింది. కంటెస్టెంట్స్ తో కొత్త టాస్క్ లు ఆడిస్తూ, ఎలిమినేషన్ ప్రకియను కొనసాగించాడు నాగార్జున. గీతుని ఓ ఆట ఆడుకున్నాడు. "స్టోర్ రూం కి వెళ్ళు రేవంత్" అని నాగార్జున అనగా,"పాపం రేవంత్ కి కాలు నొప్పి ఉంది సర్. వేరే ఎవరినైనా పంపించండి." అంది గీతు.
"సరే.. నువ్వు వెళ్ళు గీతు" అని చెప్పాడు నాగ్. అలా ప్రతీసారి గీతునే స్టోర్ రూం కి పంపించాడు. ఇది సరదగా సాగింది. ఆ తర్వాత టాస్క్ లో గీతు సేవ్ అవ్వగా, "నాకు ఓట్లు వేసి సేవ్ చేసిన అందరికి థ్యాంక్స్, మీ అందరి ఇంట్లో కూడా నాలాంటి ఒక అమ్మాయి ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా" అని గీతు చెప్పింది. ఇది విని నాగార్జునతో పాటుగా ఉన్న ప్రేక్షకులు "మాకు వద్దు" అంటూ అరిచారు. దాంతో గీతు అలిగినట్టుగా అనిపించింది. ఆ తర్వాత నార్మల్ టాస్క్ లు పెడుతూ, ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున.
చివరలో ఎలిమినేషన్ లో ఆదిత్య, సుదీప ఉండగా సుదీప ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే టాస్క్ గెలిచిన వారికి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. హ్యాంపర్ ఇస్తూండగా, హ్యంపర్ సైజ్ పెంచాలని రేవంత్ సరదాగా చెప్పాడు. నిన్నటి ఎపిసోడ్ ఇలా సరదగా, సందడిగా గడిచింది.