English | Telugu

Karthika Deepam2 : శౌర్య చెప్పిన నిజం.. పారిజాతానికి టార్చర్ చూపించిన కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -536 లో....జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెళ్లి షాపింగ్ చేద్దామని అంటుంది. నువ్వు అంత సీరియస్ గా తీసుకోకని జ్యోత్స్న అంటుంది. ఆ శౌర్యతో ఇలా చెప్పానని జ్యోత్స్నకి పారిజాతం చెప్తుంది. అప్పుడే దీప, కార్తీక్, శౌర్య ఎంట్రీ ఇస్తారు. జ్యో గ్రానీ అంటు పారిజాతం దగ్గరికి శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది.

ఏంటి శౌర్య అంత ప్రేమ చూపిస్తుందని శివన్నారాయణ అనగానే ఏదో దానికి నేనంటే చాలా ప్రేమ అని పారిజాతం అంటుంది. పారిజాతం ఒళ్ళో శౌర్య కూర్చొని జ్యో గ్రాని చాలా మంచిది. నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పిందని శౌర్య అనగానే ఏం మంచి విషయాలు చెప్పిందని శివన్నారాయణ అడుగుతాడు. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తను పుట్టాక నన్ను పట్టించుకోరట అంటూ పారిజాతం చెప్పిన విషయాలన్నీ చెప్తుంది. శౌర్య నువ్వు వెళ్లి నా గదిలో స్వీట్ ఉంది తీసుకొని తినమని పంపిస్తాడు. నీ కూతురికి పారిజాతం అలా చెప్పి తప్పు చేసింది నువ్వు ఏ శిక్ష వెయ్యామంటావని దీపని అడుగుతాడు శివన్నారాయణ. గుర్తు ఉండిపోయే శిక్ష వేయమని దీప అనగానే.. రోజంతా దీప చేసే పనులు అన్ని చెయ్యాలని శివన్నారాయణ ఆర్డర్ వేస్తాడు. నీకు సూపర్ వైజర్ గా కార్తీక్ అని శివన్నారాయణ చెప్పగానే పారిజాతం తప్పక ఒప్పుకుంటుంది.


మరొకవైపు కాశీకి స్వప్న ఫోన్ చేసి సాయంత్రం త్వరగా రా గుడికి వెళదామని అంటుంది. శ్రీధర్ ని పర్మిషన్ అడిగితే వద్దని అంటాడు. స్వప్న కోపంగా ఫోన్ కట్ చేసుకుంటుంది. మరొకవైపు పారిజాతానికి కార్తీక్ టార్చర్ చూపిస్తాడు. ఆ తర్వాత స్వప్న దగ్గరికి కావేరి వస్తుంది. మీ ఆయన మా ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదని కోప్పడుతుంటే స్వప్నకి కావేరి సర్దిచెప్తుంది. మరొకవైపు శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వెళ్తాడు. ఈ ఇంటికి అల్లుడు వచ్చాడు కాఫీ పట్టుకొని వెళ్ళమని పారిజాతానికి కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.