English | Telugu
ఆయన ఎక్కడుంటే నేను అక్కడే!
Updated : Jul 14, 2022
జబర్దస్త్ అన్ని షోస్ లోకి నెంబర్ వన్ షోగా దాదాపు పదేళ్ల నుంచి ప్రసారమౌతోంది. ఐతే అనుకోని కారణాలు, కామెంట్ల వలన ఈ షో రేటింగ్ ఒక్కసారిగా డౌన్ ఐపోయింది. ఈ షో నుంచి అందరూ బయటికి వచ్చేయడం ఒక కారణం. వీటితో పాటు ఆర్పీ ఓపెన్ గా మల్లెమాల గురించి హీటెక్కించే కామెంట్స్ చేయడం, ఆ తర్వాత వాటికి స్పందిస్తూ ఇంకొంతమంది కౌంటర్ అటాక్స్ ఇవ్వడం కొద్దీ రోజులుగా జరుగుతూ వస్తోంది. జబర్దస్త్ ఇప్పుడు రంగులు పులుముకున్న రాజకీయంలా మారిపోయింది. ఇకపోతే ఈ షోలో చమ్మక్ చంద్ర టీమ్ లో ఉండే సత్యశ్రీ అనే అమ్మాయి మీద ఇటీవల చాలా కామెంట్స్ వస్తున్నాయి. వీళ్ళ టీంలో ఈ అమ్మాయి ఎక్కువగా కనిపిస్తూ ఉండేసరికి చంద్రకి, ఈ అమ్మాయికి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ వస్తున్నాయి.
ఇక వీటికి స్పందిస్తూ సత్యశ్రీ తన కామెంట్స్ ని చెప్పుకొచ్చింది. చమ్మక్ చంద్ర తనను జబర్దస్త్ కి పరిచయం చేసిన గురువు అని చెప్పుకొచ్చింది. "కొన్ని సీరియల్స్ లో నటించిన నాకు ఎలాంటి గుర్తింపు రాలేదు కానీ జబర్దస్త్ లో నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది" అని చెప్పుకొచ్చింది. ఆ అభిమానంతోనే చమ్మక్ చంద్ర టీమ్ లోనే తాను ఎక్కువగా స్కిట్స్ చేస్తున్నానంది. 'ఆయన ఎక్కడ ఉంటే తాను కూడా అక్కడే ఉంటాను' అంది సత్యశ్రీ. ఇక 'ఇలాంటి ఎన్నో రూమర్లు వస్తూనే ఉంటాయి. వాటిని అస్సలు పట్టించుకోను' అంది. ఐతే ఈ విషయం గురుంచి తన పేరెంట్స్ కూడా అడిగారని , నాన్న తనకు ధైర్యం చెప్పారని, ఇలాంటి కామెంట్స్ పట్టించుకోకుండా ముందు వెళ్లమంటూ ప్రోత్సహించారని చెప్పింది.