English | Telugu
ఫ్యామిలీ ముందు యష్ ని ఆడుకున్న వేద
Updated : Apr 15, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాల క్రితమే మొదలైన ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. తల్లి కాలేని తల్లి.. పాప కోసం తపించే తండ్రి.. ఈ ఇద్దరి ప్రేమలో తడిసిముద్దవుతున్న ఓ కూతురు కథగా ఈ సీరియల్ ని దర్శకుడు రూపొందించాడు. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర కీలక పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, అనంద్ తదితరులు నటించారు.
యష్ డీఎన్ ఏ టెస్ట్ కి అడ్డుచెప్పడంతో ఎలాగైనా అతనికి తెలియకుండానే అతని హెయిర్ ని సంపాదించి డీఎన్ ఏ టెస్ట్ కి పంపించాలని ప్లాన్ చేస్తుంది వేద. యష్ ఆఫీస్ కి రెడీ అవుతూ క్రాఫ్ దువ్వుకుంటుంటే యష్ తో సరసాలు మొదలుపెడుతుంది. దీంతో యష్ .. ఏంటీ ఇలా ప్రవర్తిస్తోంది? అని ఆలోచనలో పడతాడు. యష్ ఆఫీస్ కి బయలుదేరగానే తను క్రాఫ్ దువ్వుకున్న దువ్వెనకున్న వెంట్రుకల్ని తీసుకోవాలని అనుకుంటుంది.. ఇంతలో యష్ తల్లి మాళిని ఎంట్రీ ఇచ్చి ఆ దువ్వెనకున్న యష్ వెంట్రుకల్ని తీసేస్తూ దువ్వెన కావాలా? అని వేదని అడుగుతుంది.
చేసేది లేక వేద అవును అంటుంది. కట్ చేస్తే ... అభిమన్యు .. వేద అన్న మాటలకు అవమాన భారంతో తనకు ఎంత ధైర్యం నన్ను ఒక ఆడది అవమానిస్తుందా? .. ఎలాగైనా వేద నోరుమూయించాలి. ఇందుకు ఏదో ఒకటి చేయాలని క్రూరంగా ఆలోచిస్తూ వుంటాడు. మాళవిక కూడా వేదపై విషాన్ని కక్కుతుంది. కట్ చేస్తే.. తల వెంట్రుకలు మిస్సయిపోవడంతో బ్లడ్ షాంపిల్స్ అయినా తీసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తుంది వేద. ఇందుకు కొత్త నాటకం మొదలుపెడుతుంది. ఇంతకీ వేద నాటకానికి యష్ సరెండర్ అయ్యాడా?.. ఫ్యామిలీ ముందు వేద .. యష్ ని ఎలా ఆడుకుంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.