English | Telugu
వేదని టెన్షన్ పెట్టిన మాళవిక.. ఏం జరిగింది?
Updated : Feb 15, 2022
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. గత కొన్ని వారాలుగా `స్టార్ మా` ప్రేక్షకుల్ని అలరిస్తోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ పాప నేపథ్యంలో సాగే ఈ సీరియల్ సరికొత్తగా సాగుతూ పిల్లతో పాటు పెద్దల్నీ ఆకట్టుకుంటోంది. ఖుషీ కోసం పెళ్లికి డాక్టర్ వేద, యష్ రెడీ అయిపోతారు. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోతోంది. ఇక పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయిన ఇరు కుటుంబాలు పెళ్లిలో ఎలా డ్యాన్స్ చేయాలో ప్రత్యేకంగా డ్యాన్స్ మాస్టర్ లని పిలిపించి స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు.
కట్ చేస్తే... అభిమన్యు - మాళవిక ఇద్దరూ కలిసి ఖుషీతో మాట్లాడుతూ వుంటారు. నిన్ను అమెరికా పంపించి పెద్ద చదువులు చదివిస్తానని, వెళతావా? అంటాడు అభిమన్యు. అందుకు ఖుషీ వెళ్లనంటుంది. మరి ఇండియాలో వుండి ఏం చేస్తావు మిస్ ఇండియా అవుతావా?.. మిస్ మోడల్ అవుతావా? అంటాడు. ఆ మాటలకు మాళవిక సీరియస్ అవుతుంది. చిన్న పిల్లతో ఏంటా మాటలు అంటూ అభిని నిలదీస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టి వేద సంగతేంటో కనుక్కోమంటాడు అభిమన్యు. నేను చూసుకుంటానంటుంది మాళవిక.
కట్ చేస్తే.. వేదకు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని, బయటికి రమ్మంటాడు యష్.. చెల్లెలితో బయటకొచ్చిన వేద యష్ ముందు పోజు కొడుతుంది. ఐదు నిమిషాలు టైమ్ ఇస్తున్నానంటూ బెట్టుని ప్రదర్శిస్తుంది. ఆ సమయం కుదరదని యష్ చెప్పడంతో పోనీ అరగంట తీసుకోండి అంటుంది. ఎంగేజ్‌మెంట్ రింగ్ గోల్డ్ ది కాదుకదా నాతో వస్తే మంచి ఉంగరం కొనిస్తానంటాడు. అయితే `ఖరీదైన ఉంగరాలు షాప్ లో చాలా వుండొచ్చు.. కానీ వెలకట్టలేని వస్తువు ఏదైనా వుందంటే అది ఇదే అంటూ ఖుషీ చేసిన రింగ్ ని చూపిస్తుంది. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటుండగా అభిమన్యు, మాళవిక అక్కడికి వస్తారు. ఇద్దరిని అలా చూసి వాళ్లలో అనుమానం మొదలవుతుంది.
Also Read:యష్ - వేదల పెళ్లికి లైన్ క్లియర్
వెంటనే మాళవిక కారు దిగి వేద దగ్గరికి వెళుతుంది. తనని చూసిన యష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వేద షాక్ అవుతుంది. యష్‌తో రాసుకుపూసుకు తిరగడం ఏమీ బాగాలేదని వేదని నిలదీస్తుంది. నీ ఎంగేజ్ మెంట్ కి వచ్చానని, అక్కడ యష్ ఫ్యామిలీ హంగామా చేయడం తనకు నచ్చలేదంటుంది. అంతే కాకుండా ఖుషీని వేదకు అప్పగిస్తూ ఇంతకీ నీకు కాబోయే భర్త ఎవరు? అంటుంది. నువ్వు చెప్పకుండా దాటేస్తున్నా తనెవరో తెలిసిపోయిందంటూ వేదకు షాకిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.