English | Telugu

అభిమ‌న్యుని దెబ్బ‌కొట్టేందుకు వేద మాస్ట‌ర్ ప్లాన్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కూతురు కోసం త‌పించే ఓ తండ్రిక‌థ‌, కూతురు కానీ ఓ పాప కోసం త‌ల్లికానీ త‌ల్లి తాప‌త్ర‌య‌ప‌డే క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని ద‌ర్శ‌కుడు రూపొందించాడు. స్టార్ మా లో కొత్త‌గా మొద‌లైన ఈ సీరియ‌ల్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది.

ఈ రోజు ఎపిసోడ్ ఎలా వుండ‌బోతోందో ఒక సారి చూద్దాం. య‌శోధ‌ర్ ప‌డుతున్న న‌ర‌క‌యాత‌న‌కు ఎండ్ కార్డ్ వేయాల‌ని నిర్ణ‌యించుకున్న వేద మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంది. అనుకున్న వెంట‌నే య‌ష్ కు ఆ విష‌యం చెప్ప‌డానికి అత‌ని ఆఫీస్ కి వెళుతుంది. అప్ప‌టికే అభిమ‌న్యు కార‌ణంగా డిస్ట్ర‌బ్ అవుతున్న అభిమ‌న్యు చిరాగ్గా వుంటాడు. అది గ‌మ‌నించిన వేద మీ మ‌నోవేద‌న‌కు ప‌రిష్కారం వుంది. నేను డాక్ట‌ర్ తో మాట్లాడాను. డీఎన్ ఏ టెస్ట్ చేస్తే అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని య‌ష్ తో అంటుంది.

అందుకు య‌ష్ అంగీక‌రించ‌డు. ఒక వేళ రిపోర్ట్ పాజిటివ్ గా రాకుంటే ఖుషీని వ‌దులుకోవాలా? అని వేద‌ని నిల‌దీస్తాడు. ఈ విష‌యంలో నీ జోక్యం అవ‌స‌రం లేదంటూ వేద‌కు వార్నింగ్ ఇస్తాడు. అయినా స‌రే త‌న‌కు ప్రాణమైన ఖుషీ కోసం తాను ఎంత దూర‌మైనా వెళ‌తాన‌ని, ఎవ‌రినైనా ఎదిరిస్తాన‌ని అంటుంది వేద‌. అక్క‌డి నుంచి నేరుగా అభిమ‌న్యు ఇంటికి వెళ్లిన వేద .. అభిమ‌న్యుకు, మాళ‌విక‌కు చుక్క‌లు చూపిస్తుంది. య‌ష్ కు తోడుగా నేనున్నాన‌ని, త‌న భ‌ర్త‌ని ఎలా గెలిపించుకోవాలో త‌న‌కు తెలుస‌ని, ఖుషీ జోలికి వ‌స్తే తాను ఎంత దూర‌మైనా వెళ‌తాన‌ని వార్నింగ్ ఇస్తుంది. డీఎన్ ఏ టెస్ట్ కు య‌ష్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అత‌నికి తెలియ‌కుండానే అత‌ని హెయ‌ర్ సేర‌నించే పనిలో ప‌డుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.