English | Telugu
అఖిల్ ఈసారి కూడా ఆటలో అరటిపండేనా?
Updated : Apr 14, 2022
బిగ్‌బాస్ హ్యూజ్ హిట్ కావడంతో అదే ఊపుతో ఉత్తరాదిలో ఓటీటీ వెర్షన్ ని ప్రారంభించారు. అదే ఫార్మాట్ ని దక్షిణాదిలోనూ ఫాలో అయిపోదామని బిగ్ బాస్ నిర్వాహకులు చేసిన ప్రయత్నం పెద్దగా సక్సెస్ అయినట్టుగా కనిపించడం లేదు. తిట్లు, బూతులు, వ్యక్తిగత దూషణలతో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో మరింత దారుణ స్థాయికి పడిపోయింది. హిందీ, తమిళంలో సక్సెస్ అయినంతగా మన దగ్గర సక్సెస్ కాలేదనే చెప్పాలి. మొత్తం 17 మందిని ఏర్చి కూర్చి తమిళ, హిందీ ఓటీటీ వెర్షన్ లకు మించి రచ్చ చేయాలని ప్లాన్ చేశారు కానీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ వున్నారు. హమీదా, అనీల్, మహేష్ విట్టా, యాంకర్ శివ, మిత్రాశర్మ, అరియానా, బిందు మాధవి, అఖిల్, అషు రెడ్డి, నటరాజ్ మాస్టర్ వున్నారు. ఇందులో టాప్ 5 వెళ్లే వారెవరో తెలిసిపోయింది. బిందు మాధవి, అఖిల్, అషురెడ్డి, అరియానా, యాంకర్ శివ. వీళ్లు మాత్రమే టాప్ 5 లో వుంటారని తెలుస్తోంది. అంతే కాదు.. ఈ సారి బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఎవరో కూడా స్పష్టత వచ్చేసింది. సోషల్ మీడియాలో కంటెస్టెంట్ లకు షో ప్రారంభం నుంచి పెరిగే ఫాలోవర్స్ ని బట్టి ఎవరు విన్నరో ఇట్టే చెప్పేయెచ్చు.
ఈ సీజన్ లో ఇద్దరి మధ్యే పోటీ ప్రధానంగా నడుస్తూ వస్తోంది. వారే బిందు మాధవి, అఖిల్. బిగ్ బాస్ సీజన్ 4 లోనూ తన ప్రవర్తనతో నెగెటివ్ అయిపోతూ రేసులో వెనకబడిన అఖిల్ ఓటీటీ వెర్షన్ లోనూ అదే తప్పు చేస్తూ మరోసారి ఆటలో అరటిపండు అయిపోతున్నాడు. గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ బిందు మాధవిని టైటిల్ ఫేవరేట్ గా నిలబెట్టేశాడు. షోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో అఖిల్ ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 717కె. బిందు మాధవి ఫాలోవర్స్ గత వారం కంటే భారీగా పెరగడంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 917కి చేరింది. మొదట్లో అఖిల్ కంటే తక్కువే వున్న బిందు ఫాలోవర్స్ క్రమ క్రమంగా పెరిగిపోతున్నారు. దీన్ని బట్టే ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోయింది. ఎప్పటిలాగే అఖిల్ మరోసారి ఆటలో అరటిపండుగా మారిపోయాడు అంటున్నారు నెటిజన్స్.