English | Telugu

రిషి, వసుధారల ప్రేమకు అడ్డుగోడగా నిలిచిన చక్రపాణి.


అత్యంత టిఆర్పీతో దూసుకుపోతున్న బుల్లితెర ధారావాహిక 'గుప్పెడంత మనసు'. రోజుకో ట్విస్ట్ తో ఒక్క మహిళలనే కాకుండా కంప్లీట్ ఫ్యామిలీకీ నచ్చే విధంగా ఈ సీరియల్ నడుస్తోంది.

శనివారం జరిగిన ఎపిసోడ్ లో వసుధారని, ఆమె తండ్రి చక్రపాణి బెదిరించి రూమ్ లో బంధించాడు. అలా బంధించిన తర్వాత జగతి మేడం, చక్రపాణికి ఫోన్ చేసింది. ఆ తర్వాత చక్రపాణి మాట్లాడుతూ "నీ వల్లే నాకూతురు పెళ్లిపీటల మీద నుండి వెళ్లిపోయింది. ఇక నా కూతురు, నీ కొడుకుని పెళ్లి చేసుకుంటే మేం అందరం చావాల్సి ఉంటుంది" అని ఫోన్ కట్ చేసాడు. అయితే అక్కడే ఉన్న తన భార్యతో "వసుధారని కనుక నువ్వు విడిపిస్తే.. నేను ఈ విషం తాగి చస్తాను" అని బెదిరించాడు. ఆ తర్వాత చక్రపాణి వెళ్ళిపోతాడు. వసుధార రూమ్ లోనే ఏడుస్తుంటుంది.

జగతి మరో వైపు ఫోన్ లో చక్రపాణి మాట్లాడిన మాటలు అన్ని ఆలోచిస్తూ ఉంటుంది. "రిషి, వసుధారకి పెళ్లి చెయ్యాలి. ఇంట్లో ఎవరికి తెలియకుండా వసుధార వాళ్ళింటికి వెళ్దాం. ఆ విషయం రిషీకి తెలిస్తే బాధపడుతాడు. రిషీకి, ఇంట్లోవాళ్ళకి తెలియకుండా మనం వెళ్ళాలి" అని మహేంద్రతో మాట్లాడుతుంది జగతి. అలా అని బయల్దేరి వెళ్తారు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలు వింటుంది సునంద. ఆ తర్వాత రాజీవ్ కి సునంద కాల్ చేసింది. "రిషి, వసుధారలను కలిపేందుకు మహేంద్ర, జగతి వస్తున్నారు. నువు ఏం ప్లాన్ చేస్తావో చెయ్" అని రాజీవ్ తో మాట్లాడుతుంది. రాజీవ్ మాట్లాడుతూ "రిషి సార్ ని ఎలా రెచ్చగొట్టాలో నాకు తెలుసు మేడం" అని నవ్వుతుంటాడు.

వసుధారకి రిషి కాల్ చేస్తాడు. కానీ వసుధార కాకుండా చక్రపాణి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రిషి మాట్లాడుతూ "వసుధార ఎలా ఉన్నావ్. మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని ఏదో ఏదో అంటున్నాడు. నువ్వు ఏం భయపడకు. నేను వస్తున్నాను. మనల్ని ఎవరు విడదీయలేరు" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ మాటలు విన్న చక్రపాణి.. వసుధారతో, రాజీవ్ కి పెళ్ళి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. పెళ్లికి కావాలసినవి అన్నీ తీసుకొని వచ్చాడు. ఆ వస్తువులన్నీ చూసి తన భార్య "ఇవ్వన్ని ఏంటి అండి" అని అడుగుతుంది. "ఏంటంటావేంటే.. నా అల్లుడు రాజీవ్ కి, నా చిన్నకూతురు వసుధారకి పెళ్లి" అని అంటాడు. అక్కడే ఉన్న వసుధార షాక్ అవుతుంది. అప్పుడే రాజీవ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.