English | Telugu
రిషి చేసిన పనికి వసుధార గుణపాఠం చెప్పనుందా!
Updated : Feb 21, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ లో వసుధార, రిషీల మధ్య సాగే ప్రేమ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సీరియల్ ఎపిసోడ్-692 లోకి అడుగు పెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో.. తను ఏం చేస్తుందోనని వసుధార గురించి ఆలోచిస్తుండాడు రిషి. అలా రిషి ఫోన్ చేయాలా వద్దా అని అనుకునే లోపే వసుధార ఫోన్ చేస్తుంది. రిషి కోపంగా ఉంటాడు. దీంతో ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక కాసేపటికి లిఫ్ట్ చేసి ప్రాజెక్ట్ గురించి అయితే రేపు కాలేజీలో మాట్లాడుకుందామని అంటాడు.. ఎందుకంత కోపం MD సర్ అని వసుధార అంటుంది. నేనిప్పుడు MD ని కాదు.. నన్ను MD సర్ అని అనడం అవసరమా అని కోపంగా ఫోన్ కట్ చేసి స్విచ్ అఫ్ చేస్తాడు.
మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిన జగతి, మహేంద్రలు.. "ఇంకా రిషి రాలేదేంటి" అని అనుకుంటారు. ఇక రిషి కాలేజీ కి వస్తుంటే రిషి కార్ కి అడ్డంగా నిల్చొని ఉంటుంది వసుధార. రిషి కార్ పక్కకు పెట్టి పరువు తీస్తుందేమోనని అనుకొని కార్ డోర్ తీయగానే వసుధార కార్ లోపలకి వచ్చి కూర్చుంటుంది.. చేసిందంతా చేసి ఇప్పుడు తనే అలుగుతుందా అని రిషి తన మనసులో అనుకుంటాడు. తనకేనా ఇగో నేను కూడా మాట్లాడను అని వసుధార అనుకుంటుంది.
ఇక కాలేజీకి వెళ్ళిన రిషి తన క్యాబిన్ లో హార్ట్ సింబల్ బెలూన్ పై MD అని రాయబోతుండగా వసుధార వచ్చి చూడడంతో రిషి కంగారుపడతాడు. రిషిని చూస్తూ వసుధార MD సర్ అని మళ్ళీ మళ్ళీ అంటుంది. ఇక నువ్వు వెళ్ళు మీటింగ్ దగ్గరికి అని రిషి కోపంగా చెప్తాడు.. "రిషి ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాడు.. రిషి, వసుధారలు ఒకటి అయితే జగతి మహేంద్రలు కూడా కలుస్తారు. ఇలా అందరూ కలిస్తే నా పరిస్థితి ఏంటి" అని దేవయాని ఆలోచనలో పడుతుంది. అయితే రిషి కాలేజీలో జరిగే మీటింగ్ గురించి వసుధారకి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మీటింగ్ మొదలయ్యాక వసుధార మీద రివేంజ్ తీసుకుందామని మీటింగ్ లో మాట్లాడమని తనని ఇరికిస్తాడు రిషి.. ఇక మీటింగ్ లో వసుధార ఏం మాట్లాడుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.