English | Telugu

వాళ్ళ మాటలకు అమ్మబాబోయ్ నేనైతే ఫస్ట్ షాకయ్యాను

సిరి హన్మంత్ బుల్లితెర మీద ఇటు సోషల్ మీడియాలో ఈమె గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. మొదట ఆమె రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో తర్వాత కొన్ని న్యూస్‌ ఛానెల్స్ లో న్యూస్ రీడర్‌గా చేసి ఫేమస్ అయ్యింది. అలా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. "ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియల్స్ లో నటించి ఇంకా ఫేమస్ అయ్యింది. లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌, సిరి హన్మంత్‌ లీడ్ రోల్స్ లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘పులి మేక’. ఫిబ్రవరి 24 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది.

ట్రైలర్ ద్వారా సిరీస్‌ గురించిన మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యేసరికి మూవీ మేకర్స్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సిరి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఫాన్స్ కి ప్రశ్నలు అడిగే టాస్క్ ఇచ్చింది. అందులో ఒక నెటిజన్ "పులి-మేక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అక్కా" అనేసరికి " నిజం చెప్పాలంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఇంకా నా రోల్ చాలా బాగుంటుంది." అని చెప్పింది. "డైరెక్టర్ గారు, బాబీ గారు మీ చాలా మంచిగా చెప్పారు వదినా ..మీకు ఎలా అనిపించింది" అని అడిగేసరికి " అమ్మబాబోయ్ నేనైతే ఫస్ట్ షాకయ్యాను. కానీ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా మీ వల్లనే" అని చెప్పింది. మరి పులి-మేక మూవీ ఎలా ఉండబోతోంది, అందులో సిరి యాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.