English | Telugu

అమ్మని పొడిచిన నేరంపై పోలీస్ స్టేషన్ కు వసుధార..!

'గుప్పెడంత మనసు' సీరియల్.. ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షిస్తోన్న 'స్టార్ మా' టీవి సీరియల్. ఇది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. గురువారం ఎపిసోడ్- 652 లో ఏం జరిగిందంటే.. వసుధార, రాజీవ్ ల తోపులాటలో పక్కనే ఉన్న వసుధార తల్లి కడుపులో ఇనుప రాడ్ దిగిపోతుంది. అది పొడిచింది రాజీవ్. కానీ సైలెంట్ గా తన చేతులు తీసేసి వసుధార చేతులు ఆ రాడ్ మీద ఉండేలా చేసి వసుధారనే పొడిచిందని అరుస్తుంటాడు రాజీవ్. ఓ వైపు వసుధార వాళ్ళ అమ్మ పడిపోతుంది. మరో వైపు వసుధార వాళ్ళ నాన్న గాయాలతో పడి ఉంటాడు. దీన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటాడు రాజీవ్.

మరో వైపు రిషి, జగతి, మహేంద్ర అందరూ కలిసి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటారు. " అసలేంటి మేడమ్.. వసుధార ఎందుకలా మాట్లాడింది. తనే మాట్లాడిందా? ఎవరైనా మాట్లాడించారా?" అని జగతితో అంటాడు రిషి. "మనల్ని ఎందుకు వెళ్ళమంటుంది వసుధార. దీని వెనుక ఏదో జరుగుతుంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి" అని రిషీతో జగతి అంటుంది.

ఆ తర్వాత వసుధార పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. అప్పుడు వసుధారకి కాల్ చేస్తాడు రిషి. అక్కడే ఉన్న రాజీవ్ "ఫోన్ చేస్తోంది అతనే సర్.. అతనే మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నాడు" అని ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. వెంటనే ఇన్స్పెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి "వసుధార పోలీస్ స్టేషన్ లో ఉంది. వాళ్ళ అమ్మ నాన్న లను చంపే ప్రయత్నం చేసినందుకు గాను మేం తనని అరెస్ట్ చేశాం. వాళ్ళ అమ్మ చావు బతుకుల మధ్యలో ఉంది" అని చెప్తాడు. అది విని వెంటనే పోలీస్ స్టేషన్ కి వస్తాడు రిషి. వసుధారని లాకప్ లో చూసి "వసుధార.. నీకేం భయం లేదు. నీకు నేను ఉన్నాను" అని అంటాడు. దానికి వసుధార మాట్లాడుతూ "సర్ ఇక్కడి నుండి వెళ్ళండి. మన మధ్యలో ప్రస్తుతం ఏ బంధం లేదని అనుకొని వెళ్ళండి" అని అంటుంది. అలా తను అనేసరికి రిషి "ఏ బంధం లేదా" ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత వసుధార మెడలో ఉన్న తాళి కనిపిస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు.

"వసుధార.. ఆ తాళి ఏంటీ" అని జగతి మేడం అడుగుతుంది. దానికి వసుధార మాట్లాడుతూ "దయచేసి ఇప్పుడేం అడుగకండి" అని అంటుంది ఆ తర్వాత రిషిని అడుగుతుంది. "నేను ఆ తాళి కట్టలేదు. దానికి నాకు ఏం సంబంధం లేదు" అని చెప్తాడు. "వసుధార ఏంటి ఆ తాళి. నాకు తెలియాలి" అని రిషి అడుగుతాడు. "దయచేసి ఇప్పుడు నన్నేం అడుగొద్దు సర్. వెళ్ళిపోండి" అని వసుధార అంటుంది. ఇంతకి రిషికి అసలు నిజం వసుధార చెప్తుందా? లేదా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.