English | Telugu

మోనిత రీఎంట్రీతో షాక్ అయిన దీప!


'కార్తిక దీపం' సీరియల్ ఎపిసోడ్ - 1554 లో చాలా ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. గురువారం జరిగిన ఈ ఎపిసోడ్ లో మొదటగా కార్తిక్ బాధపడుతూ ఉంటాడు. దీప ఆరోగ్యం బాగోలేదని, ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆరాటపడుతూ ఉంటాడు. అలా కార్తిక్ బాధపడటం చూసి హేమచంద్ర ఓదార్చుతాడు. "నేను నా చేత్తో ఎంతో మంది ప్రాణాలని కాపాడాను. కానీ నా భార్య ప్రాణాలు కాపాడలేకపోతున్నాను" అని కార్తిక్ అంటాడు. "ఇన్ని ప్రయత్నాలు చేసిన తగ్గట్లేదంటే.. ఏదో ఒక‌ కారణం ఉంటుంది" అని హేమచంద్ర అంటాడు.

ఆ తర్వాత హిమ, శౌర్య ‌ఇద్దరు కలసి వాళ్ళ అమ్మనాన్నలైన కార్తిక్, దీపలను వెతకడానికి బయటకు వెళ్తారు. అలా వెతికి హిమకి ఒక ప్లేస్ చూపిస్తుంది శౌర్య. "నాకు ఇక్కడే అమ్మ నాన్న కన్పించారు" అని శౌర్య చెప్తుంది. దానికి హిమ కోపంగా "ఎందుకే అబద్ధాలు చెప్తున్నావ్" అని అంటుంది. అలా కాసేపు ఇద్దరు గొడవపడతారు. అలా గొడవపడి తిరిగి ఇంటికి వెళ్తారు.

కార్తీక్, దీపలు ఇంటికి వెళ్లేసరికి మోనిత కుర్చీలో కూర్చొని టీ తాగుతూ ఉంటుంది. "కార్తిక్.. నీ మాటలు విని ఎన్ని రోజులు అవుతుంది. మీ పనిమనిషి చాలా మంచిది. నేను నీ మనిషిని అని చెప్పగానే, నన్ను కూర్చొబెట్టి మంచి టీ ఇచ్చింది" అని మోనిత చెప్తుంది. కార్తిక్, దీపలు షాక్ అవుతారు. "మిమ్మల్ని చూడక ఎన్ని రోజులు అయింది . జైలు నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను. ఎలా ఉన్నావ్ అక్క" అని మోనిత అంటుంది. "ఎవరే నీకు అక్క.. ఇక్కడ నుండి వెళ్ళు అని" కోప్పడుతుంది. దానికి మోనిత "అయ్యో అక్క కూల్ డౌన్.‌ ఎందుకు అలా అరుస్తున్నావ్. అలా అరిస్తే ఆయుష్షు తగ్గుతుంది. అసలే ఎక్కువ రోజులు బ్రతకవంట కదా.. పాపం" అని జాలి చూపిస్తుంది. ఇదంతా విని కార్తిక్, దీప ఇద్దరు ఆశ్చర్యపోతారు. "ఇదంతా నీకెలా తెలుసు?" అని మోనితని అడుగుతాడు కార్తిక్. "నేను ఎక్కడున్నా అన్ని విషయాలు తెలుస్తాయి. చారుశీల అంతా చెప్పింది" అని మోనిత అంటుంది. "చారుశీల నీకెలా తెలుసు?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు కార్తిక్. "చారుశీల నా మనిషి. నేను పంపిన మనిషి. నిన్ను చూసుకోమని.. మీ బాగోగులు దగ్గరుండి చూడమని, నేను పంపిన మనిషి" అని అంటుంది మోనిత. ఇది విని ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత దీప, మోనిత మధ్య వాగ్వాదం జరుగుతుంది. చివరికి మోనితని మెడ పట్టుకు బయటకు తోసేస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.