English | Telugu
ముందు ఫ్రెండ్..తర్వాత వైఫ్ అన్న అమర్ ..ఇంటికి రా నీ పని చెప్తా అన్న తేజు
Updated : Aug 2, 2023
'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి జోష్ తో కనిపిస్తోంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భాన్ని పురస్కరించుకుని "ఫ్రెండ్ షిప్ డే స్పెషల్" గా ఈ ప్రోమోని డిజైన్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ కి అమర్ దీప్ - మానస్ , తేజస్విని గౌడ - సుహాసిని , ముక్కు అవినాశ్-కెవ్వు కార్తిక్, అనపూర్ణమ్మ- శ్రీలక్ష్మీ, బేబీ క్రితిక- సహృద, నోయెల్- వితికా శేరు వచ్చి ఆడియన్స్ అలరించారు. ఈ సందర్భంగా అమర్‌ను సరదాగా ఆట పట్టించింది శ్రీముఖి. "నీ పెళ్లాం కోసం వచ్చావా నిజంగా నీ ఫ్రెండ్ మానస్ కోసం వచ్చావా" అని అడిగేసరికి "ఫస్ట్ అయితే ఫ్రెండ్ కోసం వచ్చా ఆ తర్వాతే పెళ్లాం" అని అమర్ అనేసరికి అక్కడే ఉన్న తేజు " ఇంటికి రా చెప్తా" అని సరదాగా ఆట పట్టించింది. తర్వాత సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ- శ్రీలక్ష్మి వచ్చారు.
"రెండు కొప్పులు ఒక దగ్గర ఉండలేవు ..ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటావు" అని అన్నపూర్ణమ్మను శ్రీముఖి అడిగేసరికి "ఆమెది కొప్పు నాది ఇది" అని తన జుట్టును చూపించారు శ్రీలక్ష్మి. బుల్లితెర మీద నటించే అమర్ దీప్, మానస్ మంచి ఫ్రెండ్స్. అమర్ వైఫ్ తేజు-మానస్ కలిసి 'కోయిలమ్మ' అనే సీరియల్ లో నటించారు. అలా వీళ్ళ ముగ్గురు ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. చాల సందర్భాల్లో వీళ్లంతా కలిసి కనిపిస్తూనే ఉంటారు. ఐతే మానస్ ఇప్పుడు 'బ్రహ్మముడి' సీరియల్ లో రాజ్‌గా నటిస్తున్నాడు. ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. అమర్ దీప్ మాత్రం ప్రియాంక జైన్ తో కలిసి 'జానకి కలలగనలేదు' సీరియల్ లో రామ రోల్ లో అమాయక భర్త పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అమర్ దీప్- తేజు జోడి 'నీతోనే డ్యాన్స్' షోలో ఇరగదీసే పెర్ఫార్మెన్సెస్ చేస్తూ ప్రతీ వారం టాప్ పొజిషన్ లో ఉంటున్నారు. అలాంటి ఈ ఫ్రెండ్స్ అంతా రేపు ఆదివారం రాబోయే షోలో ఎంటర్టైన్ చేయబోతున్నారు.