English | Telugu

ఇప్పుడు సోహెల్ ప్రెగ్నెంట్ అంట.. మరి డ్యాన్స్ చేయోచ్చా!



జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు‌. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.‌. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు.ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లగ్స్ అప్లోడ్ చేయగా అత్యధిక వీక్ష

ముక్కు అవినాష్ జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు. దాంతో అతనికి మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. దాంతో అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం ముక్కు అవినాష్, అతని భార్య కలిసి 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అని చేసిన వ్లాగ్ కి లక్షల్లో వ్యూస్ వస్తువున్నాయి.

తాజాగా తన ఫ్రెండ్ మెహబూబ్ బర్త్ డే వేడుకలలో సోహెల్ , అవినాష్ ఇంకా అతడి ఫ్రెండ్స్ సందడి చేశారు. అయితే ఈ పార్టీలో సోహెల్ డాన్స్ చేస్తూ ఉండడం చూసిన అవినాష్.. " సోహెల్ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా.. డాన్స్ చెయ్యొచ్చా " అని అనగానే సోహెల్ షాకింగ్ ఎక్స్ప్రెషెన్ ఇచ్చాడు. ఇలా అవినాష్ అనడానికి కారణం లేకపోలేదు. అసలు విషయానికి వస్తే సోహెల్ నటించిన ' మిస్టర్ ప్రెగ్నెంట్ ' అనే మూవీ త్వరలో రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషనల్ లో భాగమో లేక సరదాగా ఆటపట్టించడానికి అవినాష్ అలా అన్నాడో తెలియదు. కానీ సోహెల్ మాత్రం ఆశ్చర్యపోయాడు. అయితే వాళ్ళు డాన్స్ చేస్తున్న వీడియోని అవినాష్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అయితే సోహెల్ నటించిన ' మిస్టర్ ప్రెగ్నెంట్ ' సినిమా గురించి తెలియనివాళ్ళు.. ఏంటి సోహెల్ ప్రెగ్నెంటా అని ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.