English | Telugu

అఖిల్ కి ఆ అమ్మాయిలంటే ఇష్టమన్న రాధ... సూర్య డాన్స్ కి సదా ఫిదా

బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లోంచి కొన్ని జంటలను తయారుచేసి వారితో కలిసి చేస్తున్న షో బీబీ జోడీ డాన్స్ షో. ఈ షోకి స్టార్ మాలో రెస్పాన్స్ వస్తోంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో రెట్రో స్పెషల్ థీమ్ ని తీసుకురాబోతున్నారు. జడ్జి రాధ అవినాష్ తో కలిసి "తెల్ల చీర కట్టుకున్నదెవరికోసము" అనే సాంగ్ కి వేసిన స్టెప్స్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సూపర్ అని చెప్పొచ్చు. ఇందులో అవినాష్, సదా సేమ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చేసరికి "సదా నేనంటే ఎందుకంత ఇష్టం..మాచింగ్ మాచింగ్ వేసుకొచ్చావ్" అని అవినాష్ నాగేశ్వరావు లెవెల్ లో డైలాగ్ చెప్పేసరికి సదా కూడా షాకయ్యింది.

తర్వాత ఆరియానాతో కలిసి అవినాష్ "ఆకు చాటు పిందె తడిసె" సాంగ్ కి చేసిన డాన్స్ చూసి "ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదే" అంది రాధ. ఆర్జే సూర్య, ఫైమా డాన్స్ కి సదా ఫిదా ఐపోయి కుర్చీ లోంచి లేచి వెళ్లి సూర్యతో కలిసి డాన్స్ చేసింది. మరో పక్క "నువ్వు లేని టైం చూసి మీ ఆయన చూడు ఆ సదాతో డాన్స్ చేస్తున్నాడంటూ" శ్రీముఖి ఫైమాను రెచ్చగొట్టింది. దాంతో ఫైమా "పచ్చని నా కాపురంలో చిచ్చు పడింది" అంటూ ఫన్నీగా ఏడ్చేసింది. తర్వాత చైతు, కౌశల్, అఖిల్, సూర్య లేడీ గెటప్ లో క్యాట్ వాక్ చేశారు. " ఒక అబ్బాయి అమ్మాయి గెటప్ లో వచ్చినప్పుడు వాళ్లకు ఎలాంటి అమ్మాయి కావాలో తెలిసిపోతుంది. అఖిల్ కి బోల్డ్ డాన్స్ చేస్తారు కదా. వాళ్లంటే ఇష్టం" అంటూ రాధా కైపు చూపులతో చూస్తూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. అర్జున్ కళ్యాణ్-వాసంతి, అఖిల్ -తేజు ఈ జోడీలు డాన్స్ తో అందరినీ మెప్పించేసారు. ఫైనల్ గా అభినయశ్రీ-కౌశల్ వచ్చారు. వాళ్ళ డాన్స్ చూసిన రాధ "కౌశల్ మీరు బిగినింగ్ లోనే బ్లాక్ అవుట్ అయ్యారు" అని చెప్పింది. కౌశల్ డాన్స్ కి అఖిల్ 4 మార్కులు ఇచ్చాడు. "మనం స్క్రీన్ ని మెస్మోరైజ్ చేయగలం కానీ కళ్ళను మెస్మోరైజ్ చేయలేము అని మీరే నాకు చెప్పారు" మీరు తీసుకున్న సాంగ్ కి డాన్స్ మ్యాచ్ కాలేదు అని చెప్పాడు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.