English | Telugu

నాకు అమ్మాయిలంటే ఇష్టం.... ఎంత మంది అమ్మాయిలనైనా.....

జెస్సి అంటే ఎవరో మొదట తెలీదు. కానీ బిగ్ బాస్ 5వ సీజన్ లో తెలియని వ్యక్తిగా అడుగుపెట్టి ఒక్కసారిగా బాగా ఫేమస్ ఐపోయాడు. బిగ్ బాస్ లో షణ్ముఖ్, సిరితో కలిసి ఉన్న జెస్సికి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు జెస్సి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కనిపించాడు. ఎన్నో విషయాలు చెప్పాడు. పేర్లు చెప్పకుండానే చాలామంది మీద ఫైర్ అయ్యాడు.

"బీబీ జోడిలో చాలా మంది కనిపిస్తున్నారు నువ్వెందుకు వెళ్ళలేదు" అని యాంకర్ అడిగేసరికి "ఐతే అప్పుడే నేను ఢీ ఒప్పుకున్నా..అదే టైంలో బీబీ జోడి ఆఫర్ కూడా వచ్చింది. కొన్ని అలా జరిగిపోతాయి అంతే. కానీ బీబీ జోడి టీమ్ ని మెచ్చుకోవచ్చు. వాళ్ళు నన్ను రమ్మని పిలిచారు. కానీ నేనే వెళ్ళలేదు. ఢీ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీం. నన్ను నమ్మి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను వాళ్ళను కాదని బయటికి రాలేను. కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి అనుకున్నాను కాబట్టి అలాగే ఉన్నాను. నాకు కొంత మంది నచ్చలేదు. బీబీ జోడికి వెళ్తే అక్కడ కొంతమందికి ఫేస్ చూపించాలి. అప్పుడు ఏదో ఒక విషయం బయటకు వస్తుంది. నాకైతే ఎవరితో గొడవలు లేవు. కానీ నా గురించి కొంతమంది చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నాకు అది నచ్చట్లేదు. నేను అమ్మాయిలను బాగా పొగుడుతూ ఉంటాను. నాకు అమ్మాయిలంటే ఇష్టం. ఎంత మంది అమ్మాయిలనైనా అలాగే పొగుడుతాను. ఆ అమ్మాయి నచ్చితే హగ్ చేసుకుంటా...వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చెప్తాను మీ అమ్మాయి బాగుంది అని. అమ్మాయిలకు నచ్చితేనే నేను మాట్లాడతాను వాళ్లకు నచ్చకపొతే నేను అక్కడితో ఆగిపోతాను. అవును నేను ఎదవనే...ఒక్క అమ్మాయితో ఉండి ఆ అమ్మాయే జీవితం అనే రకాన్ని నేనైతే కాదు. ఎవరైనా నన్ను అనాలంటే ముందు వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి. పేరు చెప్పను కానీ ఒక హీరోయిన్ తో నాకు రిలేషన్ కాదు గాని మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.

ఐతే నా గురించి కొన్ని గాసిప్స్ ఆమె వరకు వచ్చాయి. అన్ని తెలిసి నన్ను యాక్సెప్ట్ చేసింది. కానీ అప్పుడు అర్ధమయ్యింది వాళ్ళు ఎవరు ఇలాంటివి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అని. మా రిలేషన్ చాలా తక్కువ కాలమే ఐనా నాకు మంచి పాఠం నేర్పించింది. నేను ఆమె మాటను గుడ్డిగా నమ్మేయలేదు ఎంక్వయిరీ చేసి నిజం తెలుసుకున్నాను. అప్పటినుంచి అలాంటి వాళ్ళను పక్కన పెట్టేసాను. ఇక నా పెళ్లి విషయానికి వస్తే నా లైఫ్ లో చాలా గోల్స్ ఉన్నాయి.." అని చెప్పాడు జెస్సి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.