English | Telugu
అక్షరం రాయాలంటే వణుకు పుట్టాలే
Updated : Dec 15, 2021
బిగ్‌బాస్ హౌస్ నుంచి 12వ వారం యాంకర్ రవి అనూహ్యంగా బయటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అతని ఫ్యాన్స్ తో పాటు ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. రవి ఎలిమినేట్ కావడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై రవి ఫ్యాన్స్ ఆందోళనకు దిగగా.. సోషల్ మీడియాలో రవి ఎలిమినేషన్ పై అనుమానాలున్నాయంటూ పెద్ద రచ్చే జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రవి ఎలిమనేషన్ పై అనుమానాలున్నాయని, అతన్ని కావాలనే తొక్కేశారని మండిపడ్డారు.
Also Read:సిరి - షన్నుల హగ్గుల యుద్ధం అన్ స్టాపబుల్
ఇదిలా వుంటే రవి హౌస్ లో వున్న సమయంలో యాంటీ ఫ్యాన్స్ అతన్ని దారుణంగా ట్రోల్ చేశారు. అంతే కాకుండా అతని కుటుంబ సభ్యులని, చివరికి అతని పాపని కూడా అసభ్య పదజాలంతో ట్రోల్ చేయడం రవికి మనస్తాపాన్ని, ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఆగ్రహించిన రవి తనని, తన వారిని అసభ్య పదజాలంతో సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసిన వారిపై యుద్ధం ప్రకటించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచి పెట్టే ప్రసక్తి లేదంటూ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇన్ స్టా, ఎఫ్ బీ, ట్విట్టర్.. యూట్యూబ్ వేదికగా తనని, తన వారిని వేధించిన వారిపై కంప్లైంట్ రైజ్ చేశాడు రవి. తను కంప్లైంట్ ఇస్తున్న ఫొటోని ఇన్ స్టా వేదికగా షేర్ చేసి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. తప్పు మాట మాట్లాడాలి.. టైప్ చేయాలంటే భయం పుట్టాలని.. తప్పుడు రాతలు రాయాలనుకునే వారి వెన్నులో ఇప్పటి నుంచే వణుకు పుట్టాలి` అంటూ యాంకర్ రవి తన పోస్ట్ లో షేర్ చేశాడు. ఇప్పుడిది సెట్టింట వైరల్ గా మారింది.