English | Telugu
'బిగ్ బాస్' కంటెస్టెంట్ అభినయశ్రీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Updated : Sep 28, 2022
'అ అంటే అమలాపురం'.. ఈ పాట తెలియని వారు ఉండరు. అప్పట్లో ఉర్రూతలూగించిన ఈ పాటలో కనువిందు చేసిన నటి..అభినయశ్రీ. 'ఆర్య' మూవీలో చేసిన ఆ ఐటమ్ సాంగ్‌తో పాపులర్ అయిన ఆమె.. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా 'హంగామా'లో వేణుమాధవ్ సరసన హీరోయిన్‌గా నటించింది కూడా. 2014లో వచ్చిన 'పాండవులు' సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో మళ్లీ కనిపించలేదు. తెలుగులో కంటే తమిళ సినిమాల్లోనే ఆమె ఎక్కువగా నటించింది. ఇప్పుడు బిగ్ బాస్ 6తో బుల్లితెర మీదకి వచ్చింది.
బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రెండవ కంటెస్టెంట్ అభినయశ్రీ. ఈమె 1988లోచెన్నైలో జన్మించింది. అమ్మనాన్నలు అనురాధ, రితీష్ కుమార్. అమ్మ అనురాధ అప్పట్లో శృంగార తారగా పాపులర్. తల్లి బాటలోనే అభినయశ్రీ కూడా డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. 2001లో విడుదల అయిన స్నేహమంటే ఇదేరా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఆమె దాదాపు వందకు పైగా పాటలలో డాన్స్ చేసింది. దాదాపు నలభైకి పైగా సినిమాల్లో నటించింది. ఈమెకు ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో పాటలకు కొరియోగ్రాఫర్ గా చేస్తోంది.
బిగ్ బాస్ లోకి వెళ్ళేముందు ఒక వీడియోలో 'హౌస్ లోకి వెళ్తున్నా, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నా' అని చెప్పింది. తర్వాత హౌస్ లోకి తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. కానీ అభిమానులను సంపాదించుకోలేకపోయింది. కారణం హౌస్ లో అంత ఆక్టివ్ పర్ఫామెన్స్ ఇవ్వలేదు. మొదటి వారం నామినేషన్ లో ఉంది. ఎలిమినేషన్ లేకపోవడంతో సేవ్ అయింది. అలాగే రెండవ వారం నామినేషన్ లో ఉంది. అయితే హౌస్ లో అందరితో కలిసిపోయినా కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయింది. ఓట్లను గెలవలేకపోయింది. దీంతో రెండవ వారమే ఇంటి నుండి బయటికి వచ్చేసింది.
హౌస్ నుండి బాధతో బయటకొచ్చింది. నాగార్జునతో తన 'ఏవి' చూస్తూ ఉద్వేగానికి లోనైంది. తర్వాత నాగార్జున ఒక టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నిజాయితీగా లేరో చెప్పమన్నారు. "అందరూ నిజాయితీగా ఉన్నారు. ఒక్క రేవంత్ తప్ప, తను కన్నింగ్" అని చెప్పింది.
హౌస్ నుండి బయటికి వచ్చాక ఒక ఇంటర్వూలో మాట్లాడింది."బిగ్ బాస్ మేనేజ్ మెంట్ వాళ్ళు నాకు అన్యాయం చేసారు. అసలు నా గురించి, నేను హౌస్ లో చేసిన పనులను, డాన్స్ ని టెలికాస్ట్ చెయ్యలేదు. నేను లేకుండా ఎడిట్ చేసారు. ఓటింగ్ లో కూడా నాకంటే ఇద్దరు తక్కువలో ఉన్నారు. అయినా నన్నే హౌస్ నుండి బయటి పంపించారు" అంటూ చెప్పుకొచ్చింది.
రెమ్యునరేషన్ గురించి ఒక టీవి ఛానల్ వాళ్ళు "మీరు రోజుకి నలభై వేలు తీసుకున్నారని, ఇప్పటివరకు ఐదు లక్షల వరకు తీసుకున్నారని విన్నాం. ఎంత వరకు కరెక్ట్?" అని అడిగితే, "అదేం లేదు అండి, నా పని మధ్యలో ఆపేసి వచ్చాను. నాకు ఇంత ఇచ్చారు అని చెబుతా కదా" అని మాట దాటేసింది అభి. అయితే హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో తనకి కి రోజుకి ముప్పై నుండి నలభై వేల చొప్పున ఆమెకు అందాయని ప్రచారం జరుగుతోంది.