English | Telugu
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు ఊహించని స్టార్స్
Updated : Dec 13, 2021
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ క్లైమాక్స్ కి చేరింది. మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే ఎలా వుండబోతోంది.. భారీ స్థాయలో జరగనున్న ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా ఎవరెవరు రాబోతున్నారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని వారాలుగా రసవత్తర మలుపులు తిరుగుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. కాజల్ ఎలిమినేషన్ తో హౌస్ లో మొత్తం 5 గురు కంటెస్టెంట్ లు మిగిలారు.
4 గంటలు బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో నరకయాతన పడ్డ వనిత.. ఎందుకో తెలుసా?
టాప్ 5 కంటెస్టెంట్ లు మిగిలారు. ఇక ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడొకలెక్క అన్నట్టుగా హౌస్ వాతావరణం మారింది. టాప్ 5 కి చేరిన కంటెస్టెంట్ లలో ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే గ్రాండ్ ఫినాలేకి ఈ సారి భారీ స్థాయిలో ఊహించని గెస్ట్ లు, స్టార్ లు రానున్నారని తెలుస్తోంది.
డిసెంబర్ 19న జరగనున్న గ్రాండ్ ఫినాలేను నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేకు `ఆర్ ఆర్ ఆర్` టీమ్ గెస్ట్ లుగా వస్తారని ప్రచారం జరిగింది. అయితే బాలీవుడ్ క్రేజీ స్టార్ లని ఈ ఈవెంట్ కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోన్ లతో పాటు అలియాభట్ కూడా పాల్గొననుందని , ఇందు కోసం మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఇదే నిజమైతే గ్రాండ్ ఫినాలే మరింత గ్రాండ్ గా వెలిగిపోవడం ఖాయం.