English | Telugu

అమ్మ, ఆవకాయ్, ఆర్పీ పాటలు అస్సలు బోర్ కొట్టవు

ఉగాది పండగ వస్తున్న సందర్భంగా చానెల్స్ లో కొత్త కొత్త ఈవెంట్ ప్రోమోస్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా మల్లెమాల యాజమాన్యం "కలిసుందాం రండి" అనే థీమ్ తో ఒక కొత్త ఈవెంట్ ని పండగ రోజు 22 న ప్రసారం చేయడానికి ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ప్రోమోస్ ని ఒక్కొక్కొటిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి అలనాటి అందాల నటి లయ ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో లయ తన కూతురితో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది.

తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తోంది. ఇప్పుడు "ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా" అని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సాంగ్ వినిపిస్తుంటే ఆమె అందంగా పింక్ కలర్ శారీలో నవ్వుతూ వచ్చింది. ఆమెకోసం హైపర్ ఆది పాట కూడా ఆ పాటే పాడేశాడు..యాంకర్ ప్రదీప్ స్టెప్స్ వేసాడు. తర్వాత ఆర్పీ పట్నాయక్ వచ్చి "నిండు గోదారి కదా" అనే సాంగ్ పాడేసరికి "స్వీట్ వాయిస్ అంటూ వినడమే కానీ ఇప్పుడు ఇలా వింటున్న" అని హైపర్ ఆది పొగడ్తలతో ముంచెత్తాడు. అమ్మ, ఆవకాయ్, ఆర్పీ పట్నాయక్ గారి పాటలు ఎప్పటికీ అస్సలు బోర్ కొట్టవు అలాగే కౌసల్య కూడా మంచి సాంగ్స్ పాడి అలరించింది.

ఇక ఈ స్టేజి మీద కార్తీక దీపం సీరియల్ లో నటించిన సూర్య, హిమ ఇద్దరు కలిసి ఒక క్లాసికల్ సాంగ్ కి డాన్స్ చేశారు. జ్ఞానేశ్వర్, యాదమ్మరాజు కొంతమంది కమెడియన్స్ కలిసి ఆటో రాంప్రసాద్ తో రిక్షా తొక్కిస్తారు. "చుట్టాలింటికి వెళ్ళాలి అని రిక్షా మాట్లాడమంటే నాతో రిక్షా తొక్కిస్తారా" అని కామెడీ గా ఫైర్ అయ్యేసరికి "రిక్షాతో మాట్లాడాము కానీ అదే మాట్లాడ్డం లేదు" అంటూ ఒక ఆటో పంచ్ వేససరికి రాంప్రసాద్ సైలెంట్ ఐపోయాడు. ఇలా పండగ రోజు ఇంటిల్లిపాదినీ అలరించడానికి ఈ ఈవెంట్ రాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.