English | Telugu

శ్రీసత్యతో కాంప్లికేటెడ్ ఫ్రెండ్ షిప్!

అర్జున్ కళ్యాణ్.. బిగ్ బాస్ సీజన్-6 తో ఈ పేరు అందరికి సుపరిచితమే. అతను బిగ్ బాస్ లో ఉన్నంతవరకు శ్రీసత్య చుట్టూ తిరగడంతో షో కోసం పబ్లిసిటీ కోసం చేసాడని అనుకున్నారంతా కానీ అతను బయటకొచ్చాక ఒక్క శ్రీసత్య కోసమే తను బిగ్ బాస్ కి వెళ్ళినట్లు అర్జున్ చెప్పడంతో అందరి మద్దతు అతనికి లభించింది. అయితే బిగ్ బాస్ తర్వాత బిబి జోడీ మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో అర్జున్-వాసంతి జోడీలుగా పర్ఫామ్ చేస్తున్నారు.

అయితే ఆదివారం 'విత్ అర్జున్.. ఆస్క్ మీ సంథింగ్' అంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టాడు అర్జున్. దీంతో తన అభిమానులంతా క్వశ్చనింగ్ స్టార్ట్ చేసారు. చాలా క్వశ్చన్స్ రాగా అందులో నుండి కొన్నింటికి మాత్రం సమాధానాలు చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టాడు అర్జున్ కళ్యాణ్. బిబి జోడీ జర్నీ తో మీరు హ్యాపీగా ఉన్నారా అంటూ ఒక అభిమాని ప్రశ్న అడుగగా.. " ఎస్ డెఫినెట్లీ.. ఎందుకంటే నా ట్యాలెంట్ ని, డ్యాన్స్ ని, యాక్టింగ్ ని నిరూపించుకోడానికి ఇదొక మంచి ఫ్లాట్ ఫామ్.‌ ఫస్ట్ టూ వీక్స్ లో ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత నేను వసంతి కలిసి బాగా ప్రాక్టీసు చేశాం" అని చెప్పాడు. బిబి జోడిలో‌ మీ ఫేవరెట్ జోడీ ఎవరని అడుగగా.. సండే జోడీలలో‌ అయితే రవి-భాను జోడి, శనివారం జోడీలలో అఖిల్-తేజస్విని జోడి అంటే ఇష్టం. ఎందుకంటే తేజస్విని డ్యాన్ బాగా చేస్తుంది. ఆ తర్వాత సూర్య-ఫైమా జోడీ అంటే ఇష్టమని చెప్పాడు.

శ్రీసత్యతో మీ ఫ్రెండ్ షిప్ ఎలా ఉందని ఒకరు అడుగగా.. "కాంప్లికేటెడ్ ఫ్రెండ్ షిప్. కీప్ ఫైటింగ్ అండ్ పాచింగ్.. బట్ స్టిల్ వీ ఆర్ ఇన్ టచ్. అన్ అఫిషీయల్ గా కలుస్తుంటామని అర్జున్ చెప్పాడు. సత్యతో కలిసి ఒక పర్ఫామెన్స్ లేదా రీల్ అయినా చేయొచ్చు కదా అని ఒకరు అడుగగా.. బిబి జోడిలోనే ఒక పర్ఫామెన్స్ చేసాం బట్ అది ఎడిట్ లో లేపేసారు. రీల్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్‌ సత్య .. ఏం అంటావ్ సత్య రీల్ అంట చేద్దామా అని సమాధనమిచ్చాడు అర్జున్. ఎలా ప్రతీదానిని పాజిటివ్ గా తీసుకోగలుగుతున్నారని ఒకరు అడుగగా.. " నాకు నెగిటివ్ థాట్స్ వస్తాయి కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకొని పాజిటివ్ గా తీసుకోడానికే ట్రై చేస్తుంటాను. నిన్నటి పర్ఫామెన్స్ లో సదా మేడం నన్ను ఒక కుక్కలా చేసావ్ అని చెప్పడంతో దాన్ని తీసుకొని నన్ను చాలా మంది ట్రోల్ చేసారు. ఆ ట్రోలింగ్స్ అన్నీ చూసాను. కానీ వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అని పాజిటివ్ గా తీసుకున్నాని అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మీ ఫెవరెట్ హీరో ఎవరని అడుగగా.. పవర్ స్టార్ మ్యానరిజంతో తను వసంతి కలిసి చేసిన పర్ఫామెన్స్ లోని ఒక ఫోటోని పోస్ట్ చేసి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో అని చెప్పాడు అర్జున్ కళ్యాణ్. మీ అమ్మ నాన్నల ఫోటోలని చూపిస్తారా అని ఒక అభిమాని ప్రశ్నించగా.. అమ్మ, నాన్నలతో కలసి తను దిగిన ఫోటోలని కూడా పోస్ట్ చేసాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.