English | Telugu

తెరవెనుక ఎంతో కష్టపడ్డాం.. అయినా ప్రోమోలో చూపించరా?

బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ ప్రస్తుతం 'బీబీ జోడి' డ్యాన్స్ షోతో బిజీబిజీగా ఉన్నాడు. తేజస్వితో కలిసి రచ్చ రంబోలా చేస్తూ తన డ్యాన్స్‌తో అలరిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అఖిల్ తన ఫాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటాడు. అప్పుడప్పుడు తేజుతో కలిసి షికార్లకు కూడా వెళుతూ ఉంటాడు. ఇన్‌స్టాగ్రామ్ లో ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు కూడా చెబుతూ ఉంటాడు. రీసెంట్ గా మరి ఏమయ్యిందో మరి హాస్పిటలైజ్ కూడా అయ్యాడు. కానీ దాని డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. బీబీ జోడిలో వీళ్ళ డాన్స్ అంటే చాలు అలనాటి అందాల నటి రాధ ఒక రేంజ్ లో హుషారైపోతుంది. రతీ, మన్మధుల్లా ఉన్నారంటూ కామెంట్స్ కూడా ఇచ్చేస్తుంది. ఐతే వాళ్ళ డాన్స్ మీద పాజిటివ్, నెగటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. బుల్లితెర మీద ఇలాంటి షోస్ లో వస్తున్న ఈ పెర్ఫార్మెన్సెస్ కి సెన్సార్ లేదా అని అడిగిన నెటిజన్స్ కూడా ఉన్నారు.

ఇక ఇప్పుడు అఖిల్ ఒక విషయంగా చాలా బాధపడుతున్నాడు. తన బాధను ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఎవరికో తెలియాలి అన్నట్టుగా పోస్ట్ చేసాడు. "వాళ్లకు మా డాన్స్ నచ్చకపోతే పోయింది. కానీ మేము కూడా బీబీ జోడి షోలో ఒక భాగం అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నాకు అర్ధం కానీ విషయం ఏమిటి అంటే వాళ్ళ టీఆర్ఫీలా కోసం నాతోనే ఎందుకు ఆడుకుంటారో తెలీదు .. ప్రోమోలో రెండు సెకెన్లు కూడా చూపించలేదు మేము చేసిన డాన్స్. తెర వెనుక మేము ఎన్ని రోజులు, ఎన్ని గంటలు కష్టపడితే కదా మాకు ఇంత పర్ఫెక్షన్ వచ్చేది." అంటూ చాలా బాధపడ్డాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్- 4, బిగ్ బాస్ నాన్ స్టాప్ రన్నరప్‌గా అఖిల్ సార్థక్ నిలిచాడు. అఖిల్, తేజు బిగ్‌బాస్ ఓటిటి కంటెస్టెంట్లు కూడా. ఇప్పుడు బీబీ జోడిలో వీళ్ళ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో హాట్ గా ఎంటర్టైన్ చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.