English | Telugu

ఎక్కువ ఎగరకండి.. తర్వాత తల ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుంది!

ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ మీద చిన్నా పెద్దా సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్లంతా కూడా వీడియోస్ మీద వీడియోస్ చేసేసి తమ తమ పేజెస్ లో పోస్ట్ చేసేస్తున్నారు. మొన్న అఖిల్ సార్థక్, నిన్న గీతూ రాయల్ కూడా తమ కోపాన్ని వెళ్లగక్కారు. ఇప్పుడు "నిఖిల్ తో నాటకాలు" అంటూ ఫేమస్ సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేసే నిఖిల్ ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేసాడు.

"నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్లందరికీ ఇప్పుడు బ్లూ టిక్స్ వచ్చేసాయి. ఎవరెవరేమిటో తెలియడం లేదు. 699 కడితే బ్లూ టిక్స్ వస్తున్నాయి అంత దానికి మళ్ళీ కేక్ కటింగ్లు, సెలెబ్రేషన్లు, పార్టీలు. సరే కాదనడం లేదు. ఎవరెవరికి అప్లికేషన్స్ ప్రాబ్లమ్ అవుతాయో వాళ్లకు డబ్బులు కడితే ఈజీ అవుతుంది. సరే రేపటి రోజు ఇంతమంది అప్పొజ్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఒక ఆప్షన్ పెట్టి ఎవరెవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసి ఎవరెవరైతే నాచురల్ గా అప్లై చేసుకుంటారో వాళ్ళకే బ్లూ టిక్ ఆప్షన్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం, ఈ బ్లూ టిక్స్ అన్నీ పోయాయి అనుకోండి ..మీ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలీదు. ముందే చెప్తున్నా ఎక్కువ ఎగరకండి. చేస్తే చేయించుకోండి. అది కొంచెం ఫన్నీగా ఉంది. చాలా మంది కష్టపడతారు కదా. ఆ వెరిఫికేషన్ అయ్యాక బ్లూ టిక్ సంపాదించుకోవడం అనేది ఒక చిన్న అచీవ్మెంట్" అంటూ ఒక రేంజ్ లో నిఖిల్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

దానికి కౌంటర్ గా ఒక నెటిజన్ "బ్లూ టిక్ అనేది హార్డ్ వర్క్ చేసినందుకు రాదు. సర్టిఫై కానీ అకౌంట్స్ వల్ల చాలా మంది ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇలా బ్లూ టిక్స్ ఇవ్వడం వలన జెన్యూన్ అకౌంట్ హోల్డర్ ఎవరో కాదో తెలిసిపోతుంది. అందుకోసమే ఈ ఆప్షన్ పెట్టింది. ఇదొక అచీవ్మెంట్ అనుకునే వాళ్ళను చూస్తుంటే నాకు నవ్వొస్తోంది...ఫ్యూచర్ లో ఈ బ్లూ టిక్ ఫ్రీగా ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు" అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. "నువ్వు తలకాయ ఎక్కడా పెట్టుకుంటావ్..ఇన్స్టా లో పెట్టుకోండి మొఖం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇంకొంతమంది నెటిజన్స్. మొత్తానికి బ్లూ టిక్ ఆప్షన్ మాత్రం సోషల్ మీడియాలో ఒక సంచలనం క్రియేట్ చేస్తోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.