English | Telugu

నిద్రపోతున్న వ్యక్తిని లేపి మరీ సుమ శాడిజం!

యాంకర్ సుమ వేసే పంచులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. ఆమె పంచ్ వేస్తే పేలాల్సిందే. సుమ లేకుండా ఏ మూవీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోదు..సుమ అసలెప్పుడూ ఖాళీగానే కనిపించదు. పొరపాటున ఖాళి దొరికితే మాత్రం అప్పుడప్పుడు టూర్స్ కి, వెకేషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే కాదు ఈవెంట్ టైంలో ఖాళి దొరికితే అందరినీ ఏడిపిస్తూ శాడిస్ట్ లా బిహేవ్ చేస్తుంది కూడా. గతంలో తన పర్సనల్ అసిస్టెంట్ గా ఉండే ఒక లేడీకి డాన్స్ నేర్పించింది. డాన్స్ చేయకపోయేసరికి కసురుకుంది. అలాగే తను పెంచుకునే కుక్కకు బిస్కెట్స్ పెట్టకుండా ఏడిపించింది. వీటిని రీల్స్ గా చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు షూటింగ్ లొకేషన్లో ఒక వ్యక్తిని ఏడిపించి ఆనందించింది సుమ. కుర్చీలో కూర్చుని అలిసిపోయి నిద్రపోతున్న ఒక వ్యక్తిని చూసి అతని చెవి దగ్గరకు వెళ్లి "హ్యాపీ బర్త్ డే టు యు" అంటూ గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి లేచి ముఖం తుడుచుకున్నాడు ఆ వ్యక్తి. సుమ మాత్రం హ్యాపీగా ఏమీ తెలియనట్టుగా అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయింది. ఆ షూటింగ్ లొకేషన్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనే విషయం వాళ్ళ నవ్వులను బట్టి తెలిసింది. దీన్ని వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి "నేను నిద్రపోను..ఎవరినీ పోనివ్వను..నాలో మరో కోణం" అంటూ కాప్షన్ పెట్టుకుంది. అలా అల్లరి చేస్తుంది సుమా. సుమ ఎక్కడ ఉంటె అక్కడ సందడే సందడిగా ఉంటుంది. టాలీవుడ్ లో చాలా మంది సుమ స్పాంటేనిటీని బాగా ఇష్టపడతారు కూడా. ఇక ఇండస్ట్రీలో సింగర్ సునీతా, యాంకర్ సుమ మంచి ఫ్రెండ్స్ కూడా..సునీత కొడుకు ఆకాష్ రీసెంట్ గా తెరంగేట్రం చేసాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.