English | Telugu
చాలా ఇమాజిన్ చేసుకున్నా కానీ...పేరెంట్స్ అలా తయారవుతున్నారు ఈమధ్య
Updated : Jul 22, 2023
సుమ అడ్డా ఈ వారం షోకి "మాయాబజార్ ఫర్ సేల్" మూవీ టీమ్ వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఈ మూవీ డైరెక్టర్ గౌతమీ, ఈషా రెబ్బ, రవి వర్మ, జెస్సి వచ్చారు. సుమ వీళ్ళతో గేమ్స్ ఆడించింది. ఇందులో వాళ్ళ లవ్ స్టోరీస్ ని కూడా అడిగి తెలుసుకుంది. "గౌతమీ గారు మీది లవ్ మ్యారేజ్ ఆ అండి" అని సుమ అడిగేసరికి "అవును.నేను మా ఆయన ఫస్ట్ జాబ్ కంటే ముందు ట్రైనింగ్ లో కలుసుకున్నాం.. టిసిఎస్ ముంబయి కాలేజీ తను మా కాలేజీ నుంచి నేను సెలెక్ట్ అయ్యాము..కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా కలుసుకున్నాం.
కాకపొతే మా లవ్ మ్యారేజ్ ని అందరూ ఒప్పుకుని ఒప్పుకుని చివరికి సాధారణ అరేంజ్డ్ మ్యారేజ్ చేసి పారేశారు . ఆయన తెలుగు వాళ్ళే..కానీ మాది ఇంటర్ క్యాస్ట్.. మా సైడ్ అంతా లిబరల్ గా ఉంటారు. వాళ్ళ సైడ్ కూడా లిబరల్ గా ఉండి అందరూ మా పెళ్ళికి ఒప్పేసుకున్నారు. నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను కానీ అక్కడ ఏమీ జరగలేదు" అని గౌతమీ చెప్పేసరికి "ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కూడా ఇలా తయారవుతున్నారు..పాపం వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి వాళ్లకు పిల్లలకు చెప్పుకోవడానికి వీరగాధలు వద్దా" అని ప్రశ్నించింది సుమ. గౌతమీ చల్లగుళ్ళ "పోష్ పోరీస్" అనే ఒక వెబ్ సిరీస్ చేశారు. ఈ సీరీస్ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఈమె రాశారు. ఐతే ఈ వెబ్ సిరీస్ డిజాస్టర్ గా నిలవడం తర్వాత వచ్చిన మరో ఫీచర్ ఫిలిం చేయలేకపోవడం కొంచెం బాధాకర విషయం అని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తర్వాత మోడల్ జెస్సిని చూస్తూ "నీ పిల్లలు గురించి చెప్పు అని సుమ అడిగేసరికి "లేదు నాకు ఇంకా వయసు రాలేదు" అని కామెడీగా చెప్పాడు.