English | Telugu

మీ చున్నీ ముట్టుకున్నానంటే ఆగమైపోతారు బిడ్డా.. సిద్ధు స్వీట్ వార్నింగ్!

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి 'తెలుసు కదా'(Telusu Kada) మూవీ టీమ్ నుంచి సిద్ధు జొన్నలగడ్డ, వైవా హర్ష, రాశి ఖన్నా వచ్చారు. ఇక షో లింక్ ని సిద్దు చెప్పాడు. "వెల్కమ్ టు సుమ అడ్డా.. సిద్ధు జొన్నలగడ్డ" అనేసరికి సుమా పడీపడీ నవ్వేసింది. సుమ అందరికీ పులిహోర ఇచ్చింది. "మొన్న ఒక షోకి వెళ్తే అక్కడ పాత పులిహోర పెట్టారు" అంటూ సిద్దు ఫీలయ్యాడు. "ఇది ఫ్రెష్ జున్ను మా గేదె నిన్ననే ఈనింది. తీసుకో బాబు" అంటూ హర్షకి ఇచ్చింది సుమ. "గేదె నిన్న ఈనితే అప్పుడే జున్ను ఎలా ఐపోయిందండి అంటూ కామెడీ చేసాడు హర్ష.

"మీరు రాశి గురించి అరె ఇది తెలుసు కదా అనే విషయం చెప్పండి" అంటూ సిద్ధుని అడిగింది సుమ. "రాశి ఒక స్ట్రిక్ట్ అమ్మాయి. ఇందాక కూడా ఫోన్ చేసి సిద్దు నేను 45 మినిట్స్ నుంచి ఇక్కడ ఉన్నాను" అంటూ అమ్రిష్ పురి వాయిస్ లో చెప్పాడు. దాంతో సుమ "నాకు తెలీలేదు అమ్రిష్ పురి గారు మీకేమవుతారు" అని సరదాగా అడిగింది. "రాశి ఖన్నా అందం రహస్యం ఏమిటి" అని అదిగింది సుమ. "నిద్ర పోవడమే" అని చెప్పింది రాశి. "షూటింగ్ చేసే టైములో కూడా నిద్రపోతుంది" అంటూ సిద్దు ఆమె పరువు తీసేసాడు.

"మేడం వైవా హర్షకు, నాకు పదేళ్ల ఫ్రెండ్ షిప్ ఉంది. వాడంత దొంగ నాకొడుకు లేడు" అన్నాడు సిద్దు. "ఇదేంటి నేను ఫీలైనా నువ్వు ఆడడం మానేస్తావేంటి" అంటూ హర్షా అడిగాడు. "నా వలన ప్రాబ్లమ్ ఐతే వెళ్ళిపోతా మావా నేను" అంటూ సిద్దు ఆటపట్టించాడు. "రాశి వాళ్ళ పిఆర్ టీమ్ ఎం చెప్పింది అంటే అక్కడ ఎం జరుగుతున్నా నువ్వు నవ్వుతూనే ఉండు. అందుకే రాశి అలా నవ్వుతూనే ఉంది " అంటూ రాశి మీద సెటైర్స్ వేసాడు సిద్దు. "ఈ బాంబే వాళ్ళు అలాగే చెప్తారు. అన్నిటికీ నవ్వితే పిచ్చి అనుకుంటారు జనాలు" అన్నాడు సిద్దు.

ఫైనల్ లో కాయ్ రాజా కాయ్ గేమ్ ఆడించింది సుమ. అందులో సిద్దు షర్ట్ పట్టుకుని రాశి లాగుతూ ఉంటుంది. ఆమె మీద అరుస్తాడు సిద్దు. ఇంతలో వైవా హర్ష పక్కన మరో నటి "సచ్ ఏ బాయ్" అంది. ఆ డైలాగ్ కి సిద్దు "సచ్ ఏ బాయ్ ఆ.. మీ దగ్గరకు వచ్చి చున్నీ ముట్టుకున్నానంటే ఆగమైపోతారు బిడ్డా" అంటూ భయపెట్టేసాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..