English | Telugu
నాకోసం ఏమైనా జోక్స్ చెప్పొచ్చుగా క్యూట్ గా అడిగిన దీప్తి సునైనా
Updated : Mar 4, 2023
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. రకరకాల వీడియోస్ తో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది దీప్తి. లేటెస్ట్ గా ఈమె పెయిటింగ్ వేస్తూ ఒక ఫోటో షూట్ చేసింది. అందులో తన క్యూట్ లుక్స్ తో, అందమైన నవ్వుతో, గోడల మీద బొమ్మలు వేస్తూ చూసే అందరినీ ఆకట్టుకుంటుంది అమ్మడు. పెయిటింగ్ వేయడమేమో కానీ చిన్నపిల్లల్లా ఒంటినిండా రంగులు పూసుకుని కలర్ఫుల్ హోలీ ముగ్గులా కనిపించింది.
ఇప్పుడు మరో ఇన్స్టాగ్రామ్ స్టేటస్ తో సందడి చేసింది. "గైస్...ఏమైనా జోక్స్ చెప్పొచ్చుగా క్యూట్ గా నాకు ప్లీజ్ ? " అని అడిగింది. మరి ఇలాంటి మెసేజ్ చూస్తే ఎవ్వరైనా ఆగుతారా అసలు. రిప్లైస్ బాగా ఇచ్చినట్టున్నారు నెటిజన్స్, ఫాన్స్..ఏమిచ్చారో తెలీదు కానీ "చాలా . కష్టపడి నాకోసం అడగగానే రిప్లైస్ ఇచ్చారు గైస్. మీ అందరి మెసేజెస్ చదివాను. 60 % మంది నేను అందంగా ఉంటానని మెసేజ్ చేశారు..థ్యాంక్యూ గైస్" అంటూ హార్ట్ షేప్, లవ్ షేప్ ఎమోజిస్ తో ధన్యవాదాలు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంటర్టైన్ చేసిన యూట్యూబర్ దీప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్య గ్లామర్ షోస్ తో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. కెరీర్ గ్రాఫ్ పెంచుకోవడం కోసం రకరకాల ఫోటో షూట్స్ లో కనిపిస్తూ కవ్విస్తోంది.